Menu Close

Aa Gattununtava Naganna Song Lyrics In Telugu – Rangasthalam

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టుకొస్తావా నాగన్న

యే… ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునేమో సిసాడు సార ఉంది… కుండేడు కల్లు ఉంది
బుడ్డేడు బ్రాంది ఉంది…
ఈ గట్టునేమో ముంతడంత… మజ్జిగుంది
ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టుకొస్తావా… హేయ్
ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టుకొస్తావా… హేయ్

ఆ దిబ్బనుంటావా నాగన్న… ఈ దిబ్బకొస్తావా… హేయ్
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా… హేయ్
ఆ దిబ్బనేమో… తోడేళ్ళ దండు ఉంది
నక్కాల మూక ఉంది… పందికొక్కుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో… గోవుల మంద ఉంది
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా… హేయ్
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా… హేయ్

ఆ గడపనుంటావా నాగన్న… ఈ గడపకొస్తావా… హేయ్
ఆ గడపనుంటావా నాగన్న… ఈ గడపకొస్తావా… హేయ్
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది
గుర్రాపు డెక్క ఉంది… గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో… గంధపు చెక్క ఉంది
ఆ గడపనుంటావా నాగన్న… ఈ గడపకొస్తావా… హేయ్
ఆ గడపనుంటావా నాగన్న… ఈ గడపకొస్తావా… హేయ్

ఈ ఏపుకొస్తావా నాగన్న… ఆ ఏపునుంటావా నాగన్న
ఈ ఏపుకొస్తావా నాగన్న… ఆ ఏపునుంటావా… హేయ్
ఈ ఏపునేమో నాయముంది…
ధర్మముంది, బద్ధముంది… శుద్ధముందీ
ఆ ఏపునన్నిటికి ముందర “అ” ఉంది… అంటే
అన్నాయం, అధర్మం, అబద్ధం అశ్ ఉష్… అందుకని
ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టుకొస్తావా నాగన్న
ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టుకొస్తావా నాగన్న

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading