అలెగ్జాండర్ ది గ్రేట్ ని ఓడించిన మహారాజు గురించి కనీసం విన్నారా – A Story of Alexander the Great
అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మీరు గొప్పగా చదువుకుని వుంటారు, మరి అలాంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ని ఓడించిన మహారాజు గురించి కనీసం విన్నారా..?
ఎందుకు వినలేదు? ఎందుకు చదవలేదు? అదే మన దౌర్భాగ్యం.

ఒక వేటగాడు సింహాన్ని చంపినప్పుడు ఆ విషయాన్ని ఫోటోలతో సహా రాసి ప్రకటిస్తాడు. అదే సింహాలకే రాయడం వచ్చి ఉంటే ఎంతమంది వేటగాళ్లు మరణించారో ప్రచురించి ఉండేవి. భారతదేశపు కొదమ సింహాల చరిత్రను రచింపచేసే ప్రయత్నము ఎక్కువగా చేయలేదు. అందుకే మన దేశ చరిత్ర గురించి మనకు అంతగా తెలియదు.
పాశ్చాత్యులను అనుసరించే మన భారతీయ మేధావులు రాసిన చరిత్రనే మనం ఇంకా చదువుతున్నాం.
ఇక అలెగ్జాండర్ ది గ్రేట్ ని ఓడించిన మహారాజు దగ్గరకి వస్తే..
A Story of Alexander the Great: అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీసు దేశం లోని మాసిడోనియా ప్రాంతపు రాజు. విశ్వ విజేత కావాలన్న కోరికతో ముందుగా గ్రీసు లోని ఇతర రాజ్యాలను జయించాడు. ఆ పైన దక్షిణంగా సాగి అనేక దేశాలని జయించి సువిశాల పర్షియా సామ్రాజ్యాన్ని కూడా తన కైవసం చేసుకున్నాడు. అక్కడ ఉండగానే పర్వతాలు దాటిన తర్వాత భారతదేశం అనే సుసంపన్న దేశం ఉందని తెలిసింది. దానిని జయించాలని కోరిక వచ్చింది.
హిందూ కుష్ పర్వతాలను దాటి సింధునది మైదానంలోకి ప్రవేశించిన అనంతరం అతనికి అంభి అనే రాజు ఎదురయ్యాడు. పాంచాల రాజు అయిన పురుషోత్తముని జయించే ప్రక్రియలో తాను సహాయం అందిస్తానని చెప్పాడు. అంభిని వాడుకుని పురుషోత్తముని జయించాడు. అప్పటికి అతని సైన్యానికి ఇంటికి తిరిగి పోవాలని కోరిక కలిగింది. వారి మాటను మన్నించి అలెగ్జాండరు వెనుతిరిగాడు. ఇది ఆనాటి గ్రీకు చరిత్రకారులు రచించిన చరిత్ర.
ఈ చరిత్రను ఆధారంగా చేసుకుని భారత దేశంలో అనేక సినిమాలు టీవీ సీరియల్ లు కూడా వచ్చాయి. అలెగ్జాండర్ భార్య అయిన రుక్సానా పురుషోత్తమునికి రాఖీ కట్టి తన భర్తను కాపాడమని చెప్పినది. యుద్ధ సమయంలో అలెగ్జాండర్ ని కత్తితో చంపబోతున్న పురుషోత్తమునికి రాఖీ కనిపించి ఆగిపోయాడు. ఆ బలహీన క్షణాన్ని వాడుకుని అలెగ్జాండర్ పురుషోత్తముఢిని జయించాడనీ.. నిన్ను ఎలా చూడమంటావు అని అలెగ్జాండర్ అడిగితే పురుషోత్తముడు రాజు రాజుని చూసినట్టు చూడమని అన్నాడనీ అందుకే అతనిని వదిలేసి రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడనీ అనేక మెలోడ్రామా సినిమాలు తీశారు, టీవీ సీరియల్ ఇంకా తీస్తూనే ఉన్నారు.
ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. సైనికుల మాటను మన్నించి వెనుతిరిగే లక్షణం అలెగ్జాండర్ లో ఉన్నదా? తాను వచ్చిన హిందూ కుష్ పర్వత మార్గంలో కాకుండా దక్షిణంగా ఎడారిలో సాగుతూ సముద్ర తీరానికి చేరుకుని ఓడలో అలెగ్జాండరు ఎందుకు తిరిగి వెళ్ళాడు?
ఈ రెండూ కూడా అలెగ్జాండర్ మనస్తత్వానికి భిన్నంగా ఉంటాయి. సైనికులను అదుపు చేయడమే కానీ వారి మాటను మన్నించే మనసు అలెగ్జాండర్ ది కానేకాదు. భూమార్గాన్ని వదిలి కష్టమైన ఎడారి గుండా పయనించి సముద్ర మార్గంలో వెళ్లేటంత బుద్ధిహీనుడు కూడా కాదు.
వాస్తవ చరిత్ర ఇది. యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయి లొంగిపోయాడు. శరణాగతులను చంపరాదన్న భారతీయ నీతిని అనుసరించి పురుషోత్తముడు అతనిని వదిలివేశాడు. అయితే తాను వచ్చిన హిందూకుష్ మార్గంలో కాకుండా సింధు నది పక్కనే ఎడారిలో దక్షిణంగా వెళ్లి సముద్ర మార్గంలో తిరిగి వెళ్ళాలి అని నియమం పెట్టాడు. ఇక్కడే పురుషోత్తముని యుద్ధనీతి బాగా కనిపిస్తుంది. హిందూ కుష్ మార్గంలో వెడితే అలెగ్జాండరు తిరిగి సైన్య సమీకరణ చేసి యుద్ధం చేయవచ్చు.
పురుషోత్తముడు సూచించిన మార్గం అలెగ్జాండర్ కు తిరుగులేని దెబ్బగా పరిణమించింది. అతడు తిరిగి భారతదేశంపై దండెత్తి లేకపోయాడు. పురుషోత్తముడు అనుసరించిన యుద్ధనీతిని తరువాతికాలంలో అరబ్బు దండయాత్రల సమయంలో కానీ మహమ్మద్ ఘోరీ ఓడిపోయి తిరిగి వెళ్తున్నప్పుడు కానీ దేశ పాలకులు అనుసరించి ఉంటే మన దేశం అన్యాక్రాంతం అయ్యుండేది కానేకాదు.
ఇందులో ఏది నిజం.!
- Alexander the Great fought King Purushothamudu (Porus) at the Battle of Hydaspes in 326 BCE.
- Purushothamudu ruled Punjab and had a strong army with war elephants.
- The elephants created challenges for Alexander’s Macedonian forces.
- Despite his tactics, Alexander faced strong resistance from Purushothamudu.
- Purushothamudu’s bravery earned Alexander’s admiration after the battle.
- Alexander allowed Purushothamudu to retain and expand his kingdom.
- Indian accounts often portray Purushothamudu as the moral victor.
- Alexander’s army refused to advance further into India after this battle.
- The battle symbolizes Indian resilience against foreign invaders.
- Purushothamudu is remembered as a brave and dignified ruler in Indian history.