ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Best Telugu Quotes Text
- ఏ ఊళ్ళో గ్రంథాలయాన్ని ప్రారంభించాలని కార్యకర్త బయలుదేరాడో అచట
దేశం కోసం పరితపించే వ్యక్తి ఉన్నాడని అర్థం. - ఇతరులకంటె మెరుగ్గా ఉండలనుకోవడం కన్నా ఎప్పుడూ నీకంటె నువ్వు
మరింకింత మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. - నీ మాటలు, చేతలు శాంతి మార్గం వైపు మళ్ళించు, నీ ఆలోచనలు స్వచ్ఛంగా
ఉంటే ప్రతి పనీ ఉన్నతమవుతుంది. - నీమనసులో నీకు ప్రశాంతత దొరకకపోతే మరెక్కడో వుంటుందనుకోవడం భ్రమ.
- మంచిమాట చెప్పడం కన్నా, మంచి పని చేయడం ఉత్తమం.
- ఓడి పోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోనివారే నిజమైన
ధైర్యవంతులు. - కష్టాల చిట్టా విప్పకు, అందరికీ అవి మామూలే. నీకున్న సుఖాలను గమనించు
అవే నీకు వరాలు. - క్షమించడం వల్ల గతం మారిపోక పోవచ్చు. కానీ, భవిష్యత్తు మాత్రం తప్పక
మారుతుంది నీకు అనుకూలంగా. - జీవితాన్ని ఆశావహ దృక్పథంంతో గడపటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఆయుర్దాయాన్ని కూడ పెంచుతుంది. - నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు, నీ నిర్ణయాలే తప్పా నీ అరచేతి గీతలు కావు.
- ఒక్కోసారి మనం చేయవలసిన పనుల కన్నా, చేయకూడని పనులేవో
తెలుసుకోవడం చాలా అవసరం. - జీవితంలో ఎదురయ్యే కష్టాలను చూసి నీరు కారకూడదు. అవి నిన్ను నువ్వు
నిరూపించుకోవడానికి ఉపకరిస్తాయి. - విజయం దానంతట అదిరాదు. సాధనతోనే అది సాధ్యమవుతుంది.
- ఇతరులను సంతోషంగా ఉంచాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా నీలో
కరుణ ఉండలి. - ముళ్ళ మధ్య ఉన్నా గులాబీ అందంగా విరబూస్తున్నట్లే కష్టాలు చుట్టుముట్టినా
ధీరుల పెదాలపై చిరునవ్వు చెదరదు. - మంచి శ్రోత ప్రతిచోట గుర్తింపు పొందుతాడు. శ్రద్ధగా వినే అలవాటు వల్ల
కాలక్రమంలో జ్ఞానాన్ని పొందుతాడు. - మంచి మనిషి ఆలోచన ఎప్పుడూ వృథా కాదు. మరింకిందెరికో స్పూర్తినిస్తుంది.
- అసాధ్యాలను సుసాధ్యం చేయాలంటే, సాధ్యం కానిదేదీ ఉండదని నమ్మటమే మార్గం.
- మీకింకా మిగిలిన జీవితాన్ని, మీ జీవితంలోని ఒక అద్భుతమైన భాగంగా
మలచుకోవచ్చు- అది ఈ క్షణం నుంచే. - నిజమైన ప్రేమ ఇస్తుందే కానీ ఇమ్మని కోరదు. బాధలను సహిస్తుందే కానీ
బాధలు పెట్టదు. - గెలిచిన వాడికి గతం ఉంటుంది, ఓడినవాడికి భవిష్యత్తు ఉంటుంది!
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1