ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Evari Kosam Lyrics in Telugu – Prem Nagar
ఎవరి కోసం _ ఎవరి కోసం
ఈ ప్రేమ మందిరం _ యీ శూన్య నందనం
ఈ భగ్న హ్రుదయం _ ఈ అగ్ని గుండం
ఎవరి కోసం _ ఎవరి కోసం _ : ఎవరి కోసం //ఎవరి//
ప్రేమ భిక్ష నువ్వే పెట్టి… ఈ పేద హ్రుదయం పగులగొట్టి
పిచ్చివాణ్ణి పాత్ర లేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివ్వనిది దాచలేదు ఇంకెవ్వరినీ అడగ లేదు
బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు //ఎవరి//
ఓర్వలేని ఈ ప్రక్రుతి ప్రళయంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునకలైపోనీ
కూలిపోయి ధూళిలో కలిసిపోనీ కాలిపోయి బూడిదే మిగలనీ… //ఎవరి//
మమత నింపమన్నావు మనసు చంపుకొన్నావు
మధువు తాగనన్నాను విషం తాగమన్నావు
నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయం లేదు
నీ విరహంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను //ఎవరి//