Giji Gadu Lyrics in Telugu – Rajanna
గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు సూరీడు రాలేదని
కొలనిలో కమలాలు తల దించుకున్నాయి పొద్దు పొడవలేదని
గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు సూరీడు రాలేదని
కొలనిలో కమలాలు తల దించుకున్నాయి పొద్దు పొడవలేదని
గారాల మల్లమ్మ కళ్ళే తెరవకుంది తెలవారలేదే అని
నువ్వన్నా చేపన్న సూరీడికి రాజన్న ఎండక్కే లేలేమని
కొండెక్కి తన ఏడు గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని
బతుకమ్మ పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కి రారమ్మని
నడిమింటి సూరీడు నిప్పులు చెరిగేడు పసికందు పడుకుందని
నడిమింటి సూరీడు నిప్పులు చెరిగేడు పసికందు పడుకుందని
నువ్వైనా చేపన్న సూరీడికి రాజన్న మబ్బు చాటుకి పొమ్మని
నా బిడ్డకి రవ్వంత నీడి ఇమ్మని
కంటికి రెప్పలా కాచుకున్న కానీ నీ వైపే నా తల్లి చూపు
నువ్వన్నా చెప్పనా మల్లమ్మకి రాజన్నా
ఇళ్లు ధాటి పొవ్వొద్దని దయచేసి నీ దరికి రావద్దని
ఇళ్లు ధాటి పొవ్వొద్దని దయచేసి నీ దరికి రావద్దని