Menu Close

Ne Tolisariga Lyrics in Telugu – Santosham

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Ne Tolisariga Lyrics in Telugu – Santosham

ప: నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా
నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా…… స్నేహమా ||నే తొలిసారిగా||

చ: రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడవాలను చెప్పు నువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా….
నడకలు నేర్పిన ఆశవు కద తడబడనీయకు కదలిన కధ……
వెతికే మనసుకు మమతే…పంచుమా ….. ||నేతొలిసారిగా||

చ:ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వేసుమా
పెదవులపై చిరునవ్వుల దగా …. కనబడనీయవు నిప్పులసెగ
నీటికి ఆరని మంటలు రూపమా
నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా… నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా….
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా …. తీరులో ప్రళయమా…. పంతమా… బంధమా…
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా….
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా……

Ne Tolisariga Lyrics in Telugu – Santosham

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading