ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jil Jil Jil Lyrics in Telugu – Dookudu
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలంది మా ఇంటి పెళ్లి కల
దిల్ సే దిల్ ముడి వేసేయ్ మంది వారే వీరి పోయేలా
కలలే కలిపినా అనుబంధం గ
ఇల లో ఇపుడే సుముహుర్తంగా
ఎదురయ్యింది చల్లని వేళా కల్యాణ లీల
ఆడరాదరగొట్టు డోలు బాజాలు బీటు
ఊరువుయ్యాలలూగేట్టు మోత మోగించెయ్ ట్రామ్పెట్టు
అట్టాటిత్తాన్టి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు
అరేయ్ అరేయ్ ఆడరాదరగొట్టు
ఇదివరకిలాంటి పెళ్లి లేనట్టు
హే మగపెళ్ళివారమంతా వాలి పోయాం విడిదింటా
పనిలో పని పల్లకిని మోసుకొచ్చేసాం అంటా
మనువాడే శ్రీమాలక్ష్మిని తీసుకెళ్తాం మావెంటా
ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్పా పారా రా రా
పప్పర పప్పా పారా రా రా
అత్తింటి కోడలై వేలు పట్టి వచ్చేస్తా
పప్పర పప్పా పారా రా రా
అదర అదర అదరదరగొట్టు డోలు బాజాలు బీటు
ఊరువుయ్యాలలూగేట్టు మోత మోగించెయ్ ట్రంపెట్టు
అట్టాటిత్తాన్టి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు
హే పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు
పిల్లోడే కట్నం ఇచ్చుకోక తప్పదు
హే హే మావాడు మెరుపు పోటీ లేని గెలుపు
స్విస్ బ్యాంకు ఏ రాసి ఇచ్చుకున్న చాలదు
హే వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు
తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు
హే చూసేస్తున్నాడే వరుడు లగ్గమెప్పుదన్నట్టు
ఆ మాటలే అడిగిస్తుంది పిల్ల బుగ్గల్లో గుట్టు
తాపీ గా ఉన్నారేంటి తిందర గిందర లేనట్టు
ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా
హే భూలోకమంతా వెతికిచూసుకున్నా
ఇట్టాటి అమ్మడు మీకు దక్కదు
హే నీ కంటి పాప కోరి చేరు కున్న
వీరాధివీరుడు మా నిండు చంద్రుడు
హే అన్నీ తానై ఉన్నోడు దేవుడులాంటి నాన్న
నే కోరే వరమే లేదంటా తన సంతోషం కన్నా
అలనాటి రామచంద్రుడు నీలాగే ఉండుంటాడు
చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్లాడు
నీ కన్న తండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడు
ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్పా పారా రా రా
అత్తింటి కోడలై వేలు పట్టి వచ్చేస్తా
పప్పర పప్పా పారా రా రా
అదరదరగొట్టు డోలు బాజాలు బీటు
ఊరువుయ్యాలలూగేట్టు మోత మోగించెయ్ ట్రంపెట్టు
అట్టాటిత్తాన్టి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు