ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Anna Naganna Lyrics in Telugu – ChowRaasta
అన్నా ఓ నాగన్నా… ఈ వలస బాధలేందన్నా..?
అన్నా ఓ నాగన్నా… ఈ వలస బాధలేందన్నా..?
ఊరు కానీ వేరే ఊరు అది… వేరే దేశం గాని వేరే దేశం అది
ఊరు కానీ వేరే ఊరు అది… వేరే దేశం గాని వేరే దేశం అది
ఏ పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో…
అన్నా ఓ నాగన్నో… ఈ వలస బాధలేందన్నా..?
కాలాంతం కల్పాంతం… కనికరమే లేని కాలం
జర పైలంగుండు జర భద్రంగుండు
అరె..! పైలంగుండు జర భద్రంగుండు
అరె..! పైలంగుండు జర భద్రంగుండు… నాగన్నో..!
బతికే బతుకు కోసం… సదివే సదువు కోసం
కడుపు కూటి కోసం… చేసే కూలి కోసం…
నిన్ను కన్న ఊరు… నువ్వు ఉన్న దేశం…
కాలు కదలి వెళ్లి… మనసు వదలి వెళ్లి
ఏడ అమెరికానో… ఏడ ఆఫ్రికానో…
ఉడికె మంచుల్లోన… రగిలే మంటల్లోన…
తేట తెల్ల జనం… కటిక నల్ల జనం…
నడి మధ్యలో… నువ్వున్న ఒంటరితనం
ఏ పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో… ఓ ఓ
అన్నా ఓ నాగన్నా… ఈ వలస బాధలేందన్నా..?
అర్ధరాతిరి అమ్మే వచ్చి…ఈ ఈ
అర్ధరాతిరి అమ్మే వచ్చి… పాడు కలలో పలవరిస్తే… ఏ ఏ ||2||
భయం వేసి జ్వరం కాసి… దిగులు పడితే దిక్కే లేదు…
భద్రంగుండు జర పైలంగుండు నాగన్నో.. ఓ ఓ
అన్నా ఓ నాగన్నా… ఈ వలస బాధలేందన్నా..?
అన్నా ఓ నాగన్నా… ఈ వలస బాధలేందన్నా..?
ఊరు కానీ వేరే ఊరు అది… వేరే దేశం గాని వేరే దేశం అది
ఊరు కానీ వేరే ఊరు అది… వేరే దేశం గాని వేరే దేశం అది
ఏ పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో…
అన్నా ఓ నాగన్నో… ఈ వలస బాధలేందన్నా..?
కాలాంతం కల్పాంతం… కనికరమే లేని కాలం
జర పైలంగుండు జర భద్రంగుండు
అరె..! పైలంగుండు జర భద్రంగుండు
అరె..! పైలంగుండు జర భద్రంగుండు… నాగన్నో..!