ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Layilo – Oggesi Ponade Lyrics in Telugu – ChowRaasta
ఒగ్గేసి పోనాదె.. నన్ను ఒగ్గేసి పోనాదె
ఒట్టేసుకున్నాదే.. నా సేత ఒట్టేసుకున్నాదే..
నన్ను సూడొద్దని, మాటలాడొద్దని.. సంధ్య పొద్దుల్లోన మాట సైగ సెయొద్దని..
ఒట్టేసుకున్నాదే.. నా సేత ఒట్టేసుకున్నాదే..
లాయిలో లల్లాయి లాయిలో.. లాయిలో లల్లాయి లాయిలో
ఏటేసి అన్నాదె రామా! ఏటేసి అన్నాదె..
అటెట్టగంటాదే రామా! ఎలగెళ్లిపోతాదే…
సినదాని చెల్లీ పేరు సిట్టీ రాణి.. సిట్టీ రాణి.. సిట్టీ రాణి..
సినదాని చెల్లీ పేరు సిట్టీ రాణి.. సరదాగా దాని బుగ్గ గిల్లానని…
ఒగ్గేసి పోనాదె.. నన్ను ఒగ్గేసి పోనాదె..
లాయిలో లల్లాయి లాయిలో.. లాయిలో లల్లాయి లాయిలో…
అది సరేగాని మామ.. మీ రోమన్స్ ఎలగుండేది సెప్పుగద యేటి..
సన్నజాజి లాంటి నడుము ఊపుకుంటానే..
మత్తుగుండె మాటలెన్నో సెబుతుంటాదే..
ఓయ్ బాబోయ్ ఏటి నిజమే! ఇది ఎం నిజమేహే సెప్తాను ఇను..
ఆ.. సన్నజాజి లాంటి నడుము ఊపుకుంటానే..
మత్తుగుండె మాటలెన్నో సెబుతుంటాదే..
కొంగు సాటు నడుములోకి తొంగి సూతుంటే..
నవ్వుకుంటు బూతులేవో తిట్టుకుంటాదే..
లాయిలో.. లల్లాయి లాయిలో.. లాయిలో లల్లాయి లాయిలో…
లగెత్తు కొస్తాది రామా! లగ్గమెట్టమంటాది..
లల్లాయి పాటలాగా నిన్ను అల్లేసుకుంటాది..
లగెత్తు కొస్తాది రామా! లగ్గమెట్టమంటాది..
లల్లాయి పాటలాగా నిన్ను అల్లేసుకుంటాది..
ఏ.. ఏ. లాయిలో.. లల్లాయి లాయిలో..
లాయిలో లల్లాయి లాయిలో…