అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Oorellipota Mama Lyrics In Telugu – ChowRaasta
గానం: రామ్ మిర్యాలా
లిరిక్స్: ఆనంద్ గుర్రం, రామ్ మిర్యాలా
ఆడియో: చౌరాస్తా మ్యూజిక్
ఊరెళ్ళి పోతా మామ..
ఊరెళ్ళి పోతా మామ..
ఎర్ర బస్సెక్కి మళ్ళి…
తిరిగెళ్లిపోతా మామ..
ఏ ఊరెళ్తావ్ రామ..
ఏముందని ఎళ్తావ్ రామ.
ఊరన్న పేరే తప్ప..
తీరంతా మారే రామ.
నల్లమల అడవుల్లోన..
పులిచింత చెట్ల కింద.
మల్లెలు పూసేటి.. చల్లని పల్లె ఒకటుంది.
మనసున్న పల్లె జనం..
మోసం తెలియని తనం.
అడవి ఆ పల్లె అందం..
పువ్వు తేనెల సందం.
నల్లమల అడవుల్లోన..
పులిచింత చెట్ల కింద.
పుత్తడి గనుల కోసం..
చిత్తడి బావులు తొవ్వే.
పుత్తడి మెరుపుల్లోన..
మల్లెలు మాడిపోయే.
మనసున్న పల్లె జనం..
వలసల్లో చెదిరిపోయే.
ఏ ఊరెళ్తావ్ రామ..
ఏముందని ఎళ్తావ్ రామ.
ఊరన్న పేరే తప్ప..
తీరంతా మారే రామ.
ఏ ఊరెళ్తావ్ రామ..
ఏముందని ఎళ్తావ్ రామ.
ఊరన్న పేరే తప్ప..
తీరంతా మారే రామ.
గోదారి లంకల్లోన..
అరిటాకు నీడల్లోన.
ఇసుక తిన్నెలు మీద..
వెండి వెన్నెల్లు కురువ..
గంగమ్మ గుండెల్లోన..
వెచ్చంగా దాచుకున్న.
సిరులెన్నో పొంగి పొర్లే..
పచ్చని పల్లెకటుంది..
గోదారి లంకల్లోన..
అరిటాకు నీడల్లోన.
ఇసుకంతా తరలిపోయే..
వెన్నెల్లు రాలిపోయే.
ఎగువ గోదారిపైనా.. ఆనకట్టలు వెలిసే.
ఆపైన పల్లెలన్నీ.. నిలువునా మునిగిపోయే.
ఏ ఊరెళ్తావ్ రామ..
ఏముందని ఎళ్తావ్ రామ.
ఊరన్న పేరే తప్ప..
తీరంతా మారే రామ.