ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Punnamila Vachindi Prema Lyrics in Telugu – Prematho Raa
కనిపించావే తారలా… కరుణించావే దేవిలా
వరమిచ్చావే ప్రేమగా… ప్రేమగా ప్రేమగా
పున్నమిలా వచ్చింది ప్రేమ..!
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ
పండగలా నవ్వింది ప్రేమ..!
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి… ముద్దర వేసే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా
మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా
సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా
సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా
పండగలా నవ్వింది ప్రేమ..!
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ
నీ రాకతో శశిరేఖతో
నా కంటిపాపలో వెలుగొచ్చింది
నీ మాటతో ముసి నవ్వుతో
మదిలో ఎదలో కథలో మలుపొచ్చింది
నీ చెలిమితో చిరుజల్లుతో
నా పూల కొమ్మలో చిగురొచ్చింది
నీ జోడితో చిరువేడితో
జడలో మెడలో ఒడిలో కులుకొచ్చింది
హరే కృష్ణయ్యే పాడింది అష్టపదంట
ఈ రామయ్యే పాడేది ఏకపదంటా
గోపెమ్మే చెప్పింది గుట్టు కధంతా
మరి చిలకమ్మే చెప్పేది… గొప్ప కథంటా
పున్నమిలా వచ్చింది ప్రేమ..!
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
నీ లాలితో లాలింపులో
ఇన్నాళ్ళ వయసులో మలుపొచ్చింది
నీ గాలితో కౌగిళ్లతో
కలలో ఇలలో కనని కలిమొచ్చింది
నీ చేతితో చేయూతతో
ఇన్నేళ్ళ సొగసులో సెగలొచ్చింది
నీ ఆటతో సయ్యాటతో
అచటో ఇచటో ఎచటో హాయొచ్చింది
హరే కృష్ణయ్య దోచాడు… కన్నెతనాన్నే
మరి రామయ్యే కోరాడు… ప్రేమ వరాన్నే
అలా రాధమ్మే కొసరింది… కలికితనాన్నే
ఇలా ఈ గుమ్మే నడిపింది… వలపు రథాన్నే
పున్నమిలా వచ్చింది ప్రేమ..!
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి… ముద్దర వేసే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా
మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా
సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా
సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా