Menu Close

Kalaya Nijama Lyrics in Telugu – Coolie No 1


Kalaya Nijama Lyrics in Telugu – Coolie No 1

కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా
కలయా నిజమా… తొలిరేయి హాయి మహిమా
అలవాటు లేని సుఖమా… ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా… ఇకనైన మేలుకొనుమా
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా… కలయా నిజమా

లేనిపోని ఏ కూనిరాగమో
లేచి రా అంటున్నదీ, అహా
ఊరుకోని ఏ వెర్రి కోరికే
తీర్చవా అంటున్నదీ

కోకముళ్ల కూపీ తీసే
కైపు చూపు కొరుకుతున్నదీ
కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవీ
ముంచే మైకమే… మురిపించే మొహమో
కలయా నిజమా తొలిరేయి
హాయి మహిమా… కలయా నిజమా

చేయి వేయనా సేవ చెయ్యనా
ఓయ్ అనే వయ్యారమా, హ్హ హ్హా
పాలముంచిన నీటముంచిన
నీ దయే శృంగారమా, ఆహా
ఆగలేని ఆకలేవిటో… పైకి పైకి దూకుతున్నవి
కాలు నేల నిలవకుంటది… ఆకాశాన తేలుతున్నదీ
ఆ.. అంతా మాయగా అనిపించే కాలము

కలయా ఆహా… నిజమా ఆహా
తొలిరేయి హాయి మహిమా
కలయా, మ్మ్… నిజమా, హహ
తొలిరేయి హాయి మహిమా

అలవాటు లేని సుఖమా
ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా
ఇకనైన మేలుకొనుమా
కలయా ఆహా… నిజమా ఆహా
తొలిరేయి హాయి మహిమా

Kalaya Nijama Lyrics in Telugu – Coolie No 1

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading