ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Maa Voori Devudu Lyrics in Telugu – Alluda Mazaka
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామ రఘురామ జగమేలే జయరామ
కదిలి రావయ్యా కళ్యాణ రామ
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే
సీతమ్మకే వైభోగము
మాపల్లెకే పేరంటాము
లోకాలకే ఆనందము
చైత్రమాసం కోకిలమ్మ పూలమెల్లమెట్టేనంట
నింగి వంగి నెల పొంగి జంట తాళమేసేనంట
చెల్లిపోని మమతాలకి చెల్లెలు సీతమ్మ రా
తాళికట్టు భావయ్యే తారక రామయ్య
తుళ్ళిపడ్డా కన్నెలకి పెళ్లీడు పాపాలకి
వలచిన వరుడంటే రామచంద్రుడే
రాతినైనా నాతిగాచేసి కోతినైనా దూతగా పంపే
మహిమే నీ కథ రామ
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికి నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు
కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్ళు
ఓ రామ నీ పెళ్ళికే
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
బిందె పానకం బిరా బిరా తిప్పు
రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరా బిరా తిప్పు
రామచరిత హరికథగా చెప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు
తిప్పు తిప్పు తిప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు
దొరుకును దోసెడు వడపప్పు
బిందె పానకం బిరా బిరా తిప్పు
రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరా బిరా తిప్పు
రామచరిత హరికథగా చెప్పు
ఏదిరా లక్ష్మణ సీత
పర్ణశాలలో లేదెందు చేతా
విన్నాను మారీచకోత
వాడు లంకేశుడి మాయదూత
లేడల్లే వచ్చాడు ఘాత
వాణ్ని బాణానికేస్తాను మేథా
ఏదిరా లక్ష్మణ సీత
పర్ణశాలలో లేదెందు చేతా
ఏదిరా లక్ష్మణ సీత
పర్ణశాలలో లేదెందు చేతా
నెం ఆడత నే పాడతా
నెం ఆడత నే పాడతా
వాడి అంతు చూసి నెం ఆడత
వాడి గొంతు పిసికి నే పాడతా
నెం ఆడత నే పాడతా
నెం ఆడత నే పాడతా
రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మావూళ్ళురా
మంథర మాటవిని కైకలేదురా
సీత సిరి పండించే మల్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా
బుజ్జగింపు ఉడతకిచ్చ్చి
పుణ్యమేమో కప్పకిచ్ఛే
ఘనతే నీ కథ రామా
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు
త్యాగయ్య గణాల తానాలు చేసావు
బాపూజీ ప్రాణాల కడమాతవైనావు
సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామ రఘురామ జగమేలే జయరామ
కదిలి రావయ్యా కళ్యాణ రామ
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు