Jabilliki Vennelaki Lyrics In Telugu – Chanti
జాబిలికీ వెన్నెలకీ
పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో
కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిదరోవే
చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ
పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో
కడిగిన ముత్యములే
కన్న తల్లి ప్రేమ కన్న
అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్న
వేరే ముద్దలేదు ఆకలికి
కన్న తల్లి ప్రేమ కన్న
అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్న
వేరే ముద్దలేదు ఆకలికి
దేవతంటి అమ్మ నీడే
కోవెలే బిడ్డలకి
చమ్మగిల్లు బిడ్డ కన్నే
ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన
దెబ్బ కూడా దీవెనా
బువ్వ పెట్టి బుజ్జగించె
లాలనెంతో తీయన
మంచుకన్న చల్లనైన
మల్లెకన్న తెల్లనైన
అమ్మ పాటె పాడుకోనా
మల్లెకన్న తీయనైన
అమ్మ పాటే పాడుకోనా
Jabilliki Vennelaki Lyrics In Telugu – Chanti
Like and Share
+1
+1
+1