ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kamaneeyam Lyrics in Telugu – Om Namo Venkatesaya
కమనీయం కడు రమణీయం శ్రీ వేంకటేశ్వర కళ్యాణం
కమనీయం కడు రమణీయం శ్రీ వేంకటేశ్వర కళ్యాణం
ఎదలోని సిరి నేడు శ్రీదేవి కాగా
పాలించు భువనమ్మే భూదేవిగా
కమనీయం కడు రమణీయం శ్రీ వేంకటేశ్వర కళ్యాణం
లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా
చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం
సిరుల అలివేణికి, మరుల పూబోణికి,
కట్టవయ్య స్వామీ దీక్షా కంకణం
అదియే పెండ్లికి అంకురార్పణం
కమనీయం కడు రమణీయం శ్రీ వేంకటేశ్వర కళ్యాణం
అటుకులు తేనెయూ కలిపి, అనురాగము రంగరించి
అటుకులు తేనెయూ కలిపి, అనురాగము రంగరించి
పేరుగన్న పెరుమాళ్ళకు పెదవి తీపి చేయరే
అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే
రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం
స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం
తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తానే జారిపోయే తెర-చేలము
తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం
ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయా, అప్పనై ఈనాడు అప్పగించేనయా
లోకాలకప్పడగు వెంకటాద్రీషుడా…
స్వామి! లోకాలకప్పడగు వెంకటాద్రీషుడా! లోకువా చేయకు ఇంటి ఇంతులను
సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక…, ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా…
ఇంపుగా… చూడవయ్యా