అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Telugu Moral Stories
మా మామయ్యతో ఒక గంట బ్యాంకులో ఉండాల్సి వచ్చింది. ఆయన ఎవరికో డబ్బు పంపడానికి చాలా సమయం పట్టింది. “మామయ్యా! మీరెందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వసతి ఎన్నుకోరు? గంటల తరబడి ఇలా కష్టపడాల్సిన పనిలేదు కదా!
“నాకెందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వసతి!!” – మామయ్య, “డబ్బు పంపించడం వంటి బ్యాంకు పనులకు గంటలు, గంటలు పడుతుంది కదా ! అంతేకాదు ఆన్ లైన్ లో ఎన్నో చెల్లింపులు, కొనుగోళ్లు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు.” మా మామయ్యకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేర్పించడం ఆనందంగా ఉంది”
అయితే నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలవాటు చేసుకుంటే కాలు బయట పెట్టాల్సిన పని లేదన్న మాట!!” ” అంతేకాదు! కూరగాయల దగ్గర నుంచి అన్నీ ఇంటికే వస్తాయి. ఆయన ఇచ్చిన జవాబుకు నా నోట మాట రాలేదు.
ఈ రోజు ఈ బ్యాంకుకు వచ్చేప్పుడు నలుగురు పాత స్నేహితులను కలిసాను, బ్యాంకు సిబ్బందితో కాస్సేపు మాట్లాడ గలిగాను. నీకు తెలుసు, నేను ఒంటరివాడినని. నాకు ఈ పలకరింపులు, స్నేహాలు కావాలి. అందుకే బ్యాంకుకు వచ్చాను. వాళ్ళ కరస్పర్శతో నాకు కొత్త ఉత్తేజం, ఉత్సాహం వచ్చాయి.
రెండేళ్ల క్రితం నాకు జబ్బు చేస్తే, నా షాప్ యజమాని పక్కన కూర్చుని నన్ను ఓదార్చాడు. ఆ మధ్య నా భార్య రోడ్డు మీద పడితే, నా స్నేహితుడు కారులో ఇంటికి చేర్చాడు. ఆన్ లైన్లో నాకీ ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు దొరుకుతాయా నా స్నేహితులను, శ్రేయోభిలాషులను ఒదులుకోవాలా! ఈ వయసులో నాకు పరిచయాలు, బంధాలు, అనుబంధాలు, ‘ఆప్యాయతలు అవసరం.
సేకరణ – V V S Prasad