అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Telugu Short Stories
ఆయన పేరు బ్రహ్మచారి. నిజంగా బ్రహ్మచారిగా ఉన్న 90 ఏళ్ల వృద్ధుడు. ఇవ్వాళో రేపో పోయేట్లు ఉన్నాడు కూడా. అతనెవరో కుతూహలం పట్టలేక, “మీరింత కాలం వివాహం చేసుకోక బ్రహ్మచారిగానే ఉండిపోయారు, కారణం తెలుసుకోవచ్చా! ఈ వయసులో నిజం చెప్పినా మీకేం హాని జరగదు కదండి.
అవునవును, అదొక రహస్యంగానే మిగిలిపోయింది. నేను పెళ్లికి వ్యతిరేకిని కాను, కానీ పరిపూర్ణమైన లక్షణాలు ఉన్న యువతి కోసం వెతికి వెతికి వేసారి పోయాను. ప్… జీవితమంతా ఇలాగే గడిచి పోయింది.” ఇంతమంది జనాభా ఉన్న ఈ భూమ్మీద, అందులో సగం మంది మహిళలున్న ఈ నేల మీద మీకు కావలసిన పరిపూర్ణ యువతే దొరకలేదా !” కన్నీళ్ళు జారిపోతుంటే, “నాకు అటువంటి యువతి తారస పడింది.” మరెందుకు చేసుకోలేదు. ఆశ్చర్యంగా అడిగాడు ఆ ఆగంతకుడు. ఆ పండు ముసలి, ” కానీ…ఆమె కూడా పరిపూర్ణ పురుషుడి కోసం వెతుకుతోంది.
సేకరణ – V V S Prasad