ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఈ ఆలోచన లేనందుకు ధనవంతులు అనబడే వాళ్ళు సిగ్గుపడాలి – Telugu Short Stories
జర్మనీ ఒక పెద్ద పారిశ్రామిక దేశం. అక్కడి ప్రజలు చాలా విలాసంగా జీవిస్తుంటారని భ్రమపడతాం. ఆ మధ్య ఒక పర్యాటకుల బృందం హాంబర్గ్ చేరుకొని, ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడక్కడా కొద్ది మంది తప్ప టేబుల్స్ దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ఒక టేబుల్లో ఒక యువ జంట రెండు రకాల సాదకాలతో భోజనం ముగిస్తున్నారు.
మరో టేబుల్ మీద ఇద్దరు మహిళలు ఒక ఐటమ్ తెప్పించుకుని ఒక్క ముక్క మిగలకుండా తిన్నారు. పర్యాటకులు మాంఛి ఆకలి మీద ఉండి కావలసినవన్నీ ఆర్డర్ చేసి తెప్పించుకుని తిన్నంత తిని మిగిలింది పారేసి బ్రేవ్ మని రెస్టారెంట్ నుండి బయటకు వచ్చేప్పుడు, ఒక మహిళ అలా ఆహారం పారేయడం పట్ల అసహనం వెలిబుచ్చారు.
మేం దానికి కూడా డబ్బు కట్టాం కదా, మేం ఎంత ఎందుకు పారేసాం అన్నది మీకనవసరం. ఆ మహిళలకు వీళ్ళ పద్ధతి మీద కోపం వచ్చి ఎవరికో ఫోన్ చేసారు. బిలబిల మంటూ పోలీసులు వచ్చి, సంగతి 1 తెలుసుకుని 50 యూరోలు ఫైన్ వేసి, కరకుగా, “మీరు తినగలిగినంత మాత్రమే ఆర్డర్ చెయ్యాలి. డబ్బు మీదే కావచ్చు కానీ వనరులు సమాజానివి. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నారు ఎందరో. ఆహారం వృధా చేసే అధికారం మీకు లేదు.” పర్యాటకులు తలదించుకున్నారు.
ఈ ఆలోచన లేనందుకు ధనవంతులు అనబడే వాళ్ళు సిగ్గుపడాలి. మనది ధనికదేశం కాదు. ఇక్కడ జరిగే అన్ని ఫంక్షన్ లలో ఆహారం వృధా చేయబడుతుంది. ఆహారం వృధా చేసే విషయంలో మన పద్ధతులు మార్చుకోవాలి.
సేకరణ – V V S Prasad