Oka Brundhavanam Lyrics in Telugu
ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం… సాగేను తీయగ
ఒకే సుఖం… విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
నే సందెవేళ జాబిలీ
నా గీతమాల ఆమనీ
నా పలుకు తేనె కవితలే
నా కులుకు చిలక పలుకులే
నే కన్న కలల నీడ నందనం
నాలోని వయసు ముగ్ధ మోహనం
ఒకే స్వరం… సాగేను తీయగ
ఒకే సుఖం… విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
నే మనసు పడిన వెంటనే
ఓ ఇంద్రధనుసు పొందునే
ఈ వెండి మేఘమాలనే
నా పట్టు పరుపు చేయనే
నే సాగు బాట జాజి పువ్వులే
నాకింక సాటి పోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం