ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అలెగ్జాండర్ మూడు కోరికలు – Telugu Short Stories
గొప్ప గ్రీకు రాజు అలెగ్జాండర్ ఎన్నో దేశాలను జయించి ఇంటి దారి పట్టాడు. దారిలో జబ్బున పడి, చావు అంచులకు వెళ్లాడు. మృత్యువు కళ్ళకు కనబడుతుంటే, అతను జయించిన రాజ్యాలు, సంపదలు, ఏవీ తనవి కావని అర్థమైంది.
దూరాన ఉన్న ఇల్లు, తల్లిని చేరుకోలేనన్న నిజం బోధ పడింది. ఆఖరి క్షణాలు ఆసన్నమయ్యాయని తెలిసింది. తన జనరల్స్ ను పిలిచి, “నేనీ ప్రపంచాన్ని విడిచి పోతున్నాను. నా మూడు కోరికలు నెరవేర్చండి.
నా మొదటి కోరిక: నాకు వైద్యం చేసిన డాక్టర్లు నా శవపేటికను శ్మశానానికి మోసుకురావాలి.
నా రెండో కోరిక: శ్మశానానికి వెళ్ళే దారిలో, డబ్బు, బంగారం, వెండి, మణులు, మాణిక్యాలు వెదజల్లాలి. ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని,
మూడవ కోరిక: చివరగా శవపేటికనుండి నా ఖాళీ చేతులు వెలుపలికి కనిపించేట్లు అమర్చాలి.
ఆ కోరికలు విని అక్కడ ఉన్నవాళ్ళు అవాక్కయ్యారు. “నేను నేర్చుకున్న పాఠాలు ప్రపంచానికి తెలియ చేయాలని అనుకుంటున్నాను.
- ఏ డాక్టరూ నన్ను గానీ ఇంకెవరినైనా గానీ బ్రతికించలేరు. అందుకే వాళ్ళను నా శవపేటిక మోయమన్నాను.
- నేను చనిపోయిన తర్వాత ఈ సంపద నాతో రాదని దారంతా వెదజల్ల మన్నాను. చివరిగా
- నా అరచేతులు శవపేటిక నుండి విప్పార్చి చూపడంలో అర్థం, నేను ఈ భూమ్మీదికి వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో పోతున్నాను అని తెలియజేయడానికి.” అంటూ మృత్యుకౌగిలిలోకి ఒదిగి పోయాడు.
సేకరణ – V V S Prasad