ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Prema Yatralaku Brundavanam Lyrics In Telugu – Gundamma Katha
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ, అహహ అహహ హ
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనొ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో, అహహ అహహ హ
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
అహహ అహ… అహహ ఆహహహ
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా, అహహ అహహ హ
సఖినెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ ఏలనో
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
అహహ అహ… అహహ ఆహహహ
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, అహహ అహహ హ
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో