Menu Close

Nannu Vadili Neevu Polevule Lyrics In Telugu – Manchi Manasulu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nannu Vadili Neevu Polevule Lyrics In Telugu – Manchi Manasulu

నన్ను వదలి నీవు పోలేవులే… అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే ఏ ఏఏ, లేదులే
నన్ను వదలి నీవు పోలేవులే… అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే ఏ ఏఏ, లేదులే

తావిలేని పూవు విలువ లేనిదే… ఇది నిజములే, ఏ ఏఏ
నేను లేని నీవు లేనె లేవులే… ఏఏ లేవులే
తావిలేని పూవు విలువ లేనిదే… ఇది నిజములే, ఏ ఏఏ
నేను లేని నీవు లేనె లేవులే… ఏఏ లేవులే

నా మనసే చిక్కుకునె… నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు… నిండెను నీ మదిలో
నా మనసే చిక్కుకునె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే… ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే… ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయే, ఓఓ ఓ ఓ ఓ

తావిలేని పూవు విలువ లేనిదే… ఇది నిజములే, ఏ ఏఏ
నేను లేని నీవు లేనె లేవులే… ఏ ఏఏ లేవులే

సిగ్గుతెరలలో కనులు దించుకొని… తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ
సిగ్గుతెరలలో కనులు దించుకొని… తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ
రంగులీను నీ మెడలో… బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినం రానున్నదిలే, ఓఓ ఓ ఓఓ ఓ

నన్ను వదలి నీవు పోలేవులే… అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే… ఏఏ ఏ, లేదులే

తొలినాటి రేయి తడబాటు పడుతూ… మెల్లమెల్లగా నీవు రాగా
నీ మేని హొయలు నీలోని వగలు… నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసి ఉయ్యాలలూగి… ఆకాశమే అందుకొనగా, ఆ ఆఆ
పైపైకి సాగే మేఘాలదాటి… కనరాని లోకాలు కనగా, ఆ ఆఆ

ఆహా ఓహో ఉహు… ఆ ఆఆ ఆఆ ఆ ఓఓ ఓ ఓ ఓ
నిన్ను వదలి నేను పోలేనులే… అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే… ఏ ఏఏ, లేనులే
నిన్ను వదలి నేను పోలేనులే… అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే… ఏ ఏఏ, లేనులే

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading