ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Tellavaraka Munde Palle Lechindi Lyrics In Telugu – Muthyala Pallaki
ఆ ఆ హా హా ఆఆఆ ఆఆఆ ఆ
ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ
తెల్లావారకముందే పల్లే లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కొంది… అదేపనిగ కూసింది
తెల్లావారకముందే… పల్లే లేచిందీ
తనవారినందరినీ… తట్టి లేపిందీ
వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో
పక్కదులుపుకొని… ఒకే పరుగు తీసింది
అది చూసి, లతలన్నీ… ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
తెల్లావారకముందే పల్లే లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
పాలవెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
పాలవెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లెపూల రాశివంటి మమతలు
పల్లెసీమలో కోకొల్లలు
అనురాగం అభిమానం
అనురాగం, అభిమానం కవలపిల్లలు
ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు, ఊఉ
తెల్లావారకముందే పల్లే లేచిందీ
తనవారినందరినీ తట్టి లేపిందీ