ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Maavichiguru Thinagane Lyrics In Telugu – Seetamalakshmi
మావిచిగురు తినగానే… ఏఏ ఏ ఏ కోవిల పలికేనా
మావిచిగురు తినగానే… ఏఏ ఏ ఏ కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే… మావిచిగురు తొడిగేనా
కోవిల గొంతు వినగానే… మావిచిగురు తొడిగేనా
ఏమో..! ఏమనునో గానీ… ఆమని ఈవని
మావిచిగురు తినగానే… ఏ ఏ ఏ కోవిల పలికేనా
ఆఆ ఆ… కోవిల పలికేనా
తెమ్మెరతో తారాటలా… తుమ్మెదతో సయ్యాటల
తెమ్మెరతో తారాటలా… తుమ్మెదతో సయ్యాటల
తారాటల…సయ్యాటల
సయ్యాటల…తారాటల
వన్నెలే కాదు, వగలే కాదు… ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు, వగలే కాదు… ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు, బిడియాలు… పొంకాలు, పోడుములు
ఏమో..! ఎవ్వరిదోగానీ… ఈ విరి, గడసరి
మావిచిగురు తినగానే… ఏఏ ఏ ఏ కోవిల పలికేనా
ఆఆ ఆ… కోవిల పలికేనా
ఒకరి ఒళ్ళు ఉయ్యాల… వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల, జంపాల… జంపాల, ఉయ్యాల
ఒకరి ఒళ్ళు ఉయ్యాల… వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో… వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో… వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో, పులకరింతలో… పలకరింతలో పులకరింతలో
ఏమో..! ఏమగునోగానీ ఈ కథ… మన కథ
మావిచిగురు తినగానే… ఏఏ ఏ ఏ కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే… మావిచిగురు తొడిగేనా
ఏమో..! ఏమనునో గానీ… ఆమని, ఈవని
మావిచిగురు తినగానే… ఏఏ ఏ ఏ కోవిల పలికేనా
ఆఆ ఆ… కోవిల పలికేనా