ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chattaniki Nyayaniki Lyrics In Telugu – Justice Chowdary
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో
కడుపు తీపికి కట్టుబడని తీర్పూ
కన్నీటికి కరిపోనిదీతీర్పూ
ఇది ఆ దైవమే… ఇచ్చిన తీర్పూ
తప్పా తప్పా… తప్పా నెవర్
ఐ యామ్ ఇన్ ద హాండ్స్ ఆఫ్ లా
ఎనీథింగ్ హప్పెన్స్ ఇట్స్ నాట్ మై ఫ్లా
కఠినమయినది ధర్మం… కన్ను లేనిది న్యాయం
మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం
కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం
మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం
న్యాయమూర్తిగా నేనున్నప్పుడు… న్యాయస్థానం నాదైనప్పుడు
నాకు మీరు లేరూ
నేను నేను కాను… నేను నేను కానూ
నేను నేను కానూ
ఇది ఆ దైవమే… ఇచ్చిన తీర్పు
తప్పా తప్పా… తప్పా, నో
సత్యం కోసం హరిశ్చంద్రుడు సతీసుతులనెడబాసినదీ
గర్భవతిని సీతమ్మను రాముడు కారడవికి పంపించినదీ
కన్న తల్లినే కాదని కర్ణుడు… రాజ్యత్యాగము చేసినదీ
కన్న కొడుకునే కాదని నేనీ కన్నీటిని దిగమింగుతున్నది
ఎందుకోసం, ఆ… ఎందుకోసం, ఆ
దహించినా అది ధర్మం కనుకా… సహించాలి అది సత్యం కనుకా
కృశించినా,నే నశించినా… అది న్యాయం కనుకా
ఆ న్యాయమే… నా ధైవం కనుకా
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో
కడుపు తీపికి కట్టుబడని తీర్పూ
కన్నీటికి కరిపోనిదీ తీర్పూ
ఇది ఆ దైవమే… ఇచ్చిన తీర్పూ