ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Manavatvam Parimalinche Lyrics In Telugu – Neti Bharatam
మానవత్వం పరిమళించే… మంచి మనసుకు
స్వాగతం, స్వాగతం స్వాగతం
బ్రతుకు అర్ధం తెలియచేసిన… మంచి మనిషికి
స్వాగతం, స్వాగతం స్వాగతం
మానవత్వం పరిమళించే… మంచి మనసుకు స్వాగతం
కారుమబ్బులు ఆవహించిన… కటిక చీకటి జీవితంలో
వెలుగులను ప్రసరింపచేసిన… కాంతిమూర్తి స్వాగతం
మానవత్వం పరిమళించే… మంచి మనసుకు స్వాగతం
అంతు తెలియని వాటనలతో… అలమటించే ఆర్తజనులకు
కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలీ… స్నేహశీలి స్వాగతం
మానవత్వం పరిమళించే… మంచి మనసుకు స్వాగతం
పనికిరారని పారవేసిన… మోడువారిన జీవితాలకు
చిగురుటాశల దారి చూపిన… మార్గదర్శి స్వాగతం
మానవత్వం పరిమళించే… మంచి మనసుకు
స్వాగతం, స్వాగతం స్వాగతం
బ్రతుకు అర్ధం తెలియచేసిన మంచి మనిషికి
స్వాగతం, స్వాగతం స్వాగతం