Menu Close

Induvadana Kundaradana Lyrics In Telugu – Challenge


Induvadana Kundaradana Lyrics In Telugu – Challenge

ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపే తెలిపే… చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే… వగల మొగ్గేలనే

ఐ లవ్ యూ ఓ హారికా.. నీ ప్రేమకే జోహారికా
ఐ లవ్ యూ ఓ హారికా.. నీ ప్రేమకే జోహారికా
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే

కవ్వించే కన్నులలో… కాటేసే కలలెన్నో
పకపక నవ్వులలో… పండిన వెన్నెలవై నన్నందుకో
కసి కసి చూపులతో… కొస కొస మెరుపులతో నన్నల్లుకో
ముకిళించే పెదవుల్లో మురిపాలు… ఋతువుల్లో మధువంతా సగపాలు
సాహోరే భామా…హోయ్

ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపే తెలిపే… చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే… వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా… నీ ప్రేమకే జోహారికా
ఐ లవ్ యూ ఓ హారికా… నీ ప్రేమకే జోహారికా

మీసంలో మిసమిసలు… మోసాలే చేస్తుంటే
బిగిసిన కౌగిలిలో… సొగసరి మీగడలే దోచేసుకో
రుసరుస వయసులతో… ఎడదల దరువులతో ముద్దాడుకో
చలిపుట్టే ఎండల్లో సరసాలు… పగపట్టే పరువంలో ప్రణయాలు
జోహారే ప్రేమా…హోయ్

ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపే తెలిపే… చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే… వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా… నీ ప్రేమకే జోహారికా
ఐ లవ్ యూ ఓ హారికా… నీ ప్రేమకే జోహారికా
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading