Menu Close

Mallepoolu Gollumannavi Lyrics In Telugu – Anubandham


Mallepoolu Gollumannavi Lyrics In Telugu – Anubandham

మల్లెపూలు గొల్లుమన్నవీ పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నదీ గుండెలోన
వేడుంది ఒంటిలో జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

నీ చిలిపి నవ్వులో… ఆ నవ్వు వెలుగులో
నా సొగసు ఆరబోసి మెరిసి పోనా
నీ ఒంటి నునుపులో… నీ పెదవి ఎరుపులో
నా వయసు పొంగు నేను కలుపుకోనా
గంగలాగా ఉరికిరానా కడలిలాగా కలుపుకోనా
నా ఒడిలో ఉయ్యాలలూగిoచనా
నా ఎదకు నినుచేర్చి జోకొట్టనా
నీతోటి బ్రతుకంతా ఒక వింత గిలిగింత
అనిపించి మెప్పించి ఒప్పించుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవీ పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నదీ గుండెలోన
ఎర్రాని పెదవిలో బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

నీ ముద్దు ముద్దులు… మురిపాల సద్దులు
ముప్పొద్దు మునిగితేలి మురిసిపోనా
నీ మెత్తమెత్తని సరికొత్త మత్తులో
నే చిత్ర చిత్తరంగా హత్తుకోనా
హోయ్..! గుండెలోనా నిండిపోనా
నిండిపొయీ ఉండిపోనా
నీ ప్రేమ నూరేళ్ళు పండిoచనా
నీ ఇల్లు వెయ్యేళ్ళు వెలిగించనా
బంధాలు ముడివేసి… అందాల గుడి చేసి
అనురాగ అర్చనలే చేయించుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో… బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
వేడుంది ఒంటిలో… జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

Like and Share
+1
0
+1
3
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading