Menu Close

తేనెటీగల సహాయం – Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Stories, Telugu Kadhalu, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu.

పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగ దత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే చక్కటి చుక్కలాంటి కూతురుండేది. ఆపిల్ల అందం దేశదేశాల్లో పేరు మోగిపోయింది. ఎంతోమంది రాజ కుమారులు ఆపిల్లను పెళ్లి చేసుకోవాలని చూస్తుండేవాళ్లు.

వాళ్లల్లో సింహళ దేశపు రాజకొమారుడు సింహ కేరు ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగుచేసి పెద్ద పెద్ద ఓడలలో జావా దేశంమీదికి దండెత్తాడు. యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు, సామంతులు యుద్ధం చేసి సింహకేరును జావాలో కాలుపెట్టకుండానే పారదోలదామన్నారు. కాని, యోగదత్తుడు ఒప్పుకోలేదు.

రాజులు “యుద్ధం చెయ్యటం ప్రజలకు మంచిది కాదు. ఏరాజు ఓడిపోయినా నష్టపడేది ప్రజలే, కాబట్టి అతన్ని ఈ ప్రజల్ని ఏలనిద్దాం. నాకేమి అభ్యంతరం లేదు. నేను నా భార్యను పిల్లను తీసుకుని ఆడివిలోకి పోయి వుంటాను” అన్నాడు. యోగదత్తుడు అడవికి వెళ్లిపోయాడు. మంత్రులు, సామంతులు, ప్రజలు అతనితో ఆడివికి వెళ్లారు. సింహకేరు జావాలో దిగాడు. అక్కడ అతనికి ఒక్క నరమానవుడు కనిపించ లేదు. అతను నిరుత్సాహ పడ్డాడు. యోగదత్తుడెక్కడ వున్నది అతనికి జాడ చెప్పేవాళ్లేలేరు.

యోగదత్తుడు దట్టమైన అడవికిపోయి ఆక్కడ ఒక గుహలో భార్యా బిడ్డల్తో వుండసాగాడు. ఓరోజు ఉదయాన అతను తపస్సు చేసుకోటానికని బయలుదేరాడు. దోవలో తామరకొలను ఒగటి వున్నది. అక్కడ ఒక తామర పువ్వుమీద సాలీడు వలపన్ని వుంది. ఆ వలలో ఒక తేనెటీగ చిక్కుకుని వున్నది. యోగదత్తుడికి జాలి వేసి ఒక పుల్లతో దాన్ని తప్పించాడు.

ఆ తర్వాత మామూలు చోటుకుపోయి కూర్చుని తపస్సు చేసుకోవటం మొదలు పెట్టాడు. అతనికి ఆవేళ దేవి ప్రత్యక్షమై , రాజా! తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం వూరికే పోదు. శత్రువు నుంచి నిన్ను అవి కాపాడతాయి. చెట్ల మానులతో ఒక కోట కట్టు. బావాదేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో వుంతాయి” అని చెప్పి మాయమైంది.

యోగదత్తుడు ఆ ప్రకారంగానే కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి. అతని ప్రజలు కూడా ఆ కోటలోనే వున్నారు. కొంత కాలానికి యోగదత్తుడు యిక్కడ వుంటున్న సంగతి సింహకేరుకు తెలిసింది, అతను రాజును చంపి ఆతని కూతుర్ని ఎత్తుకుపోదామనుకొని పెద్ద సైన్యంతో వచ్చి కోట ముట్టడించాడు. కానీ అతన్ని ఎవ్వరూ ఎదిరించలేదు.

సింహకేరు కొయ్య కోటను ధ్వంసంచేశాడు. ఇంకేముంది తేనెటీగలు ఒక్కమాటంగా జుమ్మని లేచినాయి. సింహకేతును, అతని సైన్యాన్ని, గుర్రాల్ని చచ్చేటట్టు కుట్టినాయి, పాపం, సింహకేరు మొహం అంతా వాచి కళ్లు మొహం అంతా కనపడక గుఱ్ఱం మీదనుంచి పడిపోయాడు.. యోగదత్తుడు అతన్ని తన గుహలోకి తీసుకుపోయి గాయాలు మాన్పి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. సింహకేరు బుద్ధి తెచ్చుకుని జావా ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే వుండిపోయాడు.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading