Menu Close

ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్తితి ఏమిటి అని ఆలోచించడం ముఖ్యం-Telugu Stories


Telugu Stories, Telugu Kadhalu, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu.

అవహేళన- పశ్చాతాపం, ఒక మంచి కద! పూర్తిగా చదవండి 🙏🙏

ఒక 24 సంవత్సరాల యువకుడు తన వృద్దులైన తల్లితండ్రులతో రైలు ప్రయాణం చేస్తున్నాడు. రైలు కిటికీ ప్రక్కన చోటు దక్కడంతో చాలా ఆనందపడుతున్నాడు. ఆ పక్కనే కూర్చున్న నలుగురు యువకులు ఈ యువకుడినే చూస్తున్నారు. రైలు స్టేషన్ నుండి బైలుదేరింది. ఇంతలో ఆ యువకుడు నాన్న నాన్న చూడు చూడు. ప్లాట్ఫాం పై ఉన్న వాళ్ళందరూ వెనక్కి నడుస్తున్నారు అని గట్టిగా కేరింతలు నవ్వుతున్నాడు.

పక్కన ఉన్న ఆ నలుగురు కుర్రోళ్ళు ఈ యువకుడినే చూస్తూ నవ్వుకుంటున్నారు. ఇంతలో ఆ రైలు స్టేషన్ దాటి పక్కనే ఉన్న పల్లె ప్రాంతం వైపుగా వెళ్తుంది. మళ్ళి ఈ యువకుడు గట్టిగా “నాన్న నాన్న చూడు చెట్లు, కొండలు, రాళ్ళు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి” అని కేరింతలు మొదలు పెట్టాడు. పక్కన ఉన్న ఆ నలుగురి యువకులలో ఒకడు.., “అవునా వెళ్ళు , వెళ్ళి గట్టిగా పట్టుకో పారిపోతున్నాయి” అని గేలి చేసాడు.

ఇది విని కూడా ఆ యువకుడి తండ్రి హాయిగా నవ్వుతూనే “సరే” అంటు కొడుకు వైపు చూస్తూ ఆనందగా ఉన్నాడు ..,మళ్ళి ఈ యువకుడు గట్టిగా “నాన్నా నాన్నా చూడు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నా మేఘాలు మాత్రం మనతోనే వస్తున్నాయి” అంటూ కేరింతలు మొదలు పెట్టాడు. ఇంతలో ఆ నలుగురిలో ఒకడు “అవునవును మేఘాలని మన రైలుకి కట్టేశారు అందుకే మనతోనే వస్తున్నాయి ” అని వెక్కిరించారు.

పక్కనే ఉన్న తల్లి అవును నాన్న మేఘాలు కదా అలాగే మన వెంట వస్తాయి అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది. ఇంతలో చిన్న చిరు జల్లులతో కూడిన వర్షం మొదలైంది. ఆ కిటికీ కడ్డీలకి జాలువారుతున్న చుక్కలని చూసి. ఆ చుక్కల్లోనుండి పచ్చని ప్రకృతిని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవ్వుతున్న యువకుడిని చూసి మళ్ళి ఆ నలుగురిలో ఒకడు “మీ అబ్బాయిని ఏదైనా హాస్పిటల్ లో చూపించండి ఎందుకైనా మంచిది” అని ఎగతాళిగా మాట్లాడుతూ అన్నాడు.

ఈ యువకుడి తండ్రి “ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాం బాబు”,”పుట్టుకతో అంధుడైన మా అబ్బాయికి కళ్ళు తెప్పించలేక ఇన్నాళ్ళు ఆగాము. బ్రెయిలీ ద్వారా చదివి CA లో దేశంలోనే మొదటి రాంకు వచ్చిందని ప్రభుత్వమే ఉచితంగా వీడికి చికిత్స చేయించింది. ఇప్పుడే లోకాన్ని చూస్తున్నాడు.” అని ఆనందంగా తండ్రి వెల్లడించాడు.

తల్లి తండ్రుల డబ్బుతో విలాసంగా జీవిస్తూ ఇతరులని ఎగతాళి చేస్తున్న ఆ నలుగురు యువకులు తామెంత తప్పుగా ప్రవర్తించామో అని సిగ్గుతో తల దించుకున్నారు.

“ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్తితి ఏమిటి అని ఆలోచించడం ముఖ్యం..”

Like and Share
+1
0
+1
1
+1
0
Share with your friends & family
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading