ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Bathike Haayiga Song Lyrics In Telugu – Anubhavinchu Raja
బతికేయ్ హాయిగా
ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా
ప్రతిదీ అంతలా… భూతద్దంలోంచి చూడక
బతికేయ్ హాయిగా
ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా
ప్రతిదీ అంతలా… భూతద్దంలోంచి చూడక
నచ్చితే కలిపేసుకుపోరా… వదులుకోకు ఏ ఒక్కరిని
ఏయ్ నువ్ సర్దుకుపోరా… నచ్చకున్నా గాని
మనసే పడి హత్తుకుపోరా… వంద ఏళ్ళ ఈ బహుమానాన్ని
గోలా గొడవలతో నింపెయ్యకురా దాన్ని
తెల్లారి లేవగానే… గజిబిజిగా పరుగులేరా
ఈ జానెడు పొట్ట కోసం… దినదిన గండంరా
చుట్టూ ఓ సారి చూడు… ఎవడు సుఖపడుతూ లేడు
నీలాగే వాడు కూడా తడబడుతున్నాడు
కనుకే ఎపుడైనా… నీ మనసుని నొప్పిస్తాడు
ఎదో పొరపాటే చేస్తాడు… పోన్లే అని నువ్వే
నీలో అనుకుంటే వాడు వీడు
మనవాడే అయిపోతాడు
బతికేయ్ హాయిగా
ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా
ప్రతిదీ అంతలా… భూతద్దంలోంచి చూడక
కోపాలే పెంచుకుంటే… ఆవేశం అంచునుంటే
మన కంటికి బుద్ధుడైన… శత్రువు అయిపోడా
సరదాగా పలకరిస్తే… చిరునవ్వే చిలకరిస్తే
వద్దంటూ ఎవ్వడైనా… దూరంగుంటాడా
ఎదో ఒక లోపం ఉన్నోడే మనిషవుతాడు
లేదా అయిపోడా దేవుడిలా, ఆ ఆ
ఎపుడూ ఎదుటోల్లో… తప్పుల్నే వెతికేటప్పుడు
నువ్వు మనిషే అని… గుర్తు చేసుకోవా
(హాయిగా, రాదుగా… అంతలా, చూడక
హాయిగా, రాదుగా… అంతలా, చూడక)