Keratala Aduguna Song Lyrics In Telugu – Devi Putrudu
కెరటాల అడుగున కనుచూపు మరకోన
నిదురపోతున్నాది ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక
బాలకృష్ణుని బంగారు మొలతాడు
చిన్నికృష్ణుని సరిమువ్వ గజ్జెలు
సత్యాభామాదేవి అలకపానుపు
రుక్మిణిదేవి తులసీవనము
తీయని పాటల మురళి
తీరైన నెమలిపింఛం
కృష్ణుడు ఊదిన శంఖం
శిశుపాలుని చంపిన చక్రం
కనులు తెరువకుండా కథలు కథలుగా ఉన్నవీ ఈనాటికీ
కెరటాల అడుగున కనుచూపు మరకోన
నిదురపోతున్నాది ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక