Muthaitha Gangamma Song Lyrics In Telugu – Nagadevatha
ఊరు కాచే ముత్తైదా
గంగమ్మా గంగమ్మా… పదవమ్మా గంగమ్మా
మగని కాచే ముత్తైదా
మారేమ్మా మారేమ్మా… పోదామా మారేమ్మా
మనసాటి ముత్తైదే… వేచి ఉంది వేధనతో
పోదాము రారాండి… సౌభాగ్యం కాయండి
ఊరు కాచే ముత్తైదా
గంగమ్మా గంగమ్మా… పదవమ్మా గంగమ్మా
మగని కాచే ముత్తైదా
మారేమ్మా మారేమ్మా… పోదామా మారేమ్మా
పదపద పదపద… పదపద పదపద
పద పద పద… పదవమ్మా, అమ్మా
అమ్మా అమ్మా అమ్మా… ఎల్లమ్మా ఎల్లమ్మా
పదవమ్మా ఎల్లమ్మా, అమ్మా
ఉదయమే లేచి ప్రతి ముత్తైదు… అంబనుకాదే తరిచేది
తన మదిలోని కలతలనన్ని… అమ్మలకేగా తెలిపేది
నెలతలే లేకుంటే… దేవుడికి నెలవేది
భక్తులే రాకుంటే… గుడికి ఇక వెలుగేది
దయతోటి కుంకుమా, పూలు, అక్షింతలు… మనమంత ఇవ్వాలి
తన తాళి నిలపాలి
తాళి కాచే ముత్తైదా
ఎల్లమ్మా ఎల్లమ్మా… పోదామా ఎల్లమ్మా
ఉసురు కాచే ముత్తైదా
నూకమ్మా నూకమ్మా… రావే చెల్లి నూకమ్మా
భర్తలమేలే మనసున కోరి… వ్రతములు చేయు ప్రతి నారి
చెట్టు, పుట్టా, మన్ను, మిన్ను… మన రూపాలనే మొక్కెదరే
వారి ఆ నమ్మికయే… దేవతల ఉనికమ్మా
ఆ నమ్మకమే సడలినచో… భక్తికే అర్థం లేదమ్మా
ఆశ తోటి ముత్తైదు… వేచి ఉంది మన కొరకు
పోదాము రారండి… సౌభాగ్యము నిలపండి
ఊరు కాచే ముత్తైదా… గంగమ్మా గంగానమ్మా
మగని కాచే ముత్తైదా… మారేమ్మా మారేమ్మా
తాళి కాచే ముత్తైదా… ఎల్లమ్మా ఎల్లమ్మా
ఉసురు కాచే ముత్తైదా… రావమ్మా నూకాలమ్మ
కులము కాచే ముత్తైదా… పోలమ్మా పోలేరమ్మా
అభయమిచ్చే ముత్తైదా… ముత్యమ్మా ముత్యాలమ్మా
బ్రతుకునిచ్చే ముత్తైదా… అంకమ్మా అంకాలమ్మా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.