అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Ala Chudu Prema Lokam Song Lyrics In Telugu – Preminchukundam Raa
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ
ప్రపంచమంతా దాటేద్దాం… పద అన్నదీ
ప్రేమించుకుందాం రా నేస్తం
మన వయస్సు తపస్సు తరించు వరమిది
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపినిజమై ఫలిస్తున్నదీ
ప్రతి జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించానులేమ్మా
అదే పాట నా దాక… ఎలా చేరనమ్మా
ప్రతీ బాట నా వైపే… నిన్నే పంపెనమ్మా
నిరంతరం నీ ఊసేదో… నను రమ్మన్నదీ
ప్రతి క్షణం నీ ధ్యాసేగా
కలవరించి వరించి రప్పించుకున్నది
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ
అలల్లాంటి ఈ రాగం… నువ్వే నేర్పలేదా
తుఫానంటి ఈ వేగం… నువ్విచ్చింది కాదా
వెలేవేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం
ఏదో చేసి కాలాన్ని… అలా ఆగమందాం
రహస్య రాజ్యం చేరే… జత కథే ఇది
సుఖాల తీరం కోరే
మన ప్రయాణమివాళ ఫలించు క్షణమిది
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపినిజమై ఫలిస్తున్నదీ
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నదీ
ప్రేమించుకుందాం రా నేస్తం
మన వయస్సు తపస్సు తరించు వరమిది
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపినిజమై ఫలిస్తున్నదీ