మతమేల గతమేల మనసున్న నాడు…
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం… పూవై వికసించనీ జీవితం…
కన్నీట కడగాలి… కులమన్న పాపం…
మత రక్త సిందూరం… వర్ణాలు అరుణం…
గాయాల నీ తల్లికీ…
కన్నా…! జో లాలి పాడాలిరా…
సరిహద్దులే దాటు ఆ గాలిలా… ప్రసవించనీ ప్రేమనే హాయిగా…
నదులన్నీ కలిసేటి కడలింటిలో… తారల్లు విరిసేది గగనాలలో
కలలోకి జారేను ఈ రాత్రులే… వెలిగించి నవ్యోదయం
మతమేల గతమేల మనసున్న నాడు…
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం… పూవై వికసించనీ జీవితం
తల ఎత్తి నిలవాలి నీ దేశము… ఇల మీదనే స్వర్గమై
భయమన్నదే లేని భవితవ్యము… సాధించరా సంఘమై…
ఒక మాట… ఒక బాట… ఒక ప్రాణమై..
సాగాలిరా ఏకమై…