Menu Close

Chinuku Chinuku Andelatho Song Lyrics in Telugu-Mayalodu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Chinuku Chinuku Andelatho Song Lyrics in Telugu

చినుకు చినుకు అందెలతో… చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని… జారవిడిచి ఒళ్ళు మరచి
వాన జాణ ఆడింది వయ్యారంగా…
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా…

చినుకు చినుకు అందెలతో… చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని… జారవిడిచి ఒళ్ళు మరచి
వాన జాణ ఆడింది వయ్యారంగా…
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా…

నింగి నేల ఈ వేళ… చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి… పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలో… గుండెల్లో ఎండ కాసే ఏలో

అరె..!  పైన మబ్బు ఉరిమింది… పడుచు జింక బెదిరింది
వల వేయగా సెలయేరై పెనవేసింది…
చినుకమ్మ మెరుపమ్మ ఏలో…
చిటికేసే బుగ్గ మీద ఏలో…

వలపు తొలివలపు… ఇక తకజం తకజం
వయసు తడి సొగసు… అరవిరిసే సమయం
ఆహా… ఊహూ …ఓహోహో

చినుకు చినుకు అందెలతో… చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని… జారవిడిచి ఒళ్ళు మరచి
వాన జాణ ఆడింది వయ్యారంగా…
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా…

మనసు పట్టు తప్పింది… వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది…
వానొచ్చే వరదొచ్చే ఏలో…
వయసంటే తెలిసోచ్చే ఏలో…

మేను చూపు పోయింది… వాలు చూపు సయ్యంది
చెలి కోరిక అలవోకగ… తల ఊపింది
అరె..! సరసాల సిందులోన ఏలో
సరిగంగ తానాలు ఏలో…

ఒడిలో ఇక ఒకటై… తకతకతై అంటే
సరసానికి దొరసానికి… ముడిపెడుతుంటే…
ఆహా… ఊహూ… ఓహోహో

చినుకు చినుకు అందెలతో… చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని… జారవిడిచి ఒళ్ళు మరచి
వాన జాణ ఆడింది వయ్యారంగా…
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా… ||2||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading