ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Koncham Neeru Koncham Nippu Song Lyrics in Telugu-Donga Donga
కొంచం నీరు… కొంచం నిప్పు
ఉన్నాయి నా మేనిల్లోన…
కొంచం గరళం… కొంచం అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన…
కొంచం నరకం… కొంచం స్వర్గం
ఉన్నాయి నా గుండెల్లోనా…
చంద్రలేఖా చంద్రలేఖా… చంద్రలేఖా చంద్రలేఖా
కొంచం నీరు… కొంచం నిప్పు
ఉన్నాయి నా మేనిల్లోన…
నా కలలో ఎవరో ఒచ్చే… నా కనులా వెలుగై నిలిచే
ఓ స్వాతి చినుకై కురిసే…
అహ నా మదిలో… మెరుపై మెరిసే
ఈ పెదవి విరితేనె మడుగంట
అహ నా వగలే… దరి లేని వగలంట
నేడు ఈ భూమికే… నీ కోసం దిగివచ్చెనీ తార
తోడుగా వస్తే… మురిపాలు తీరేరా
తారను వడికేస్తే… బంగారం ఈ వన్నె
నీ ఓర చూపుల్లో… వరహాలే ఒలికేనే
నీ నవ్వుల పువ్వుల్లో… ముత్యాలే దొరికేనే
ఊరించే వంపుల్లో… హరివిల్లే విరిసేనే… ఓఓ ఓ
కొంచం నీరు… కొంచం నిప్పు
ఉన్నాయి నా మేనిల్లోన…
కొంచం గరళం… కొంచం అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన…
కొంచం నరకం… కొంచం స్వర్గం
ఉన్నాయి నా గుండెల్లోనా…
చంద్రలేఖా చంద్రలేఖా…
చంద్రలేఖా చంద్రలేఖా… ఆఆ
మనసైన నీవాడు… వినువీధిని వస్తాడే
అందాలకు బహుమతిగా… సిరివెన్నెల నిస్తాడే
కొంచం నీరు… కొంచం నిప్పు
ఉన్నాయి నా మేనిల్లోన…
కొంచం గరళం… కొంచం అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన…
కొంచం నరకం… కొంచం స్వర్గం
ఉన్నాయి నా గుండెల్లోనా…
చంద్రలేఖా… చంద్రలేఖా
చంద్రలేఖా… చంద్రలేఖా… ఆఆ