Menu Close

Mudinepalli Madichelo Song Lyrics In Telugu-Gentleman-1993


ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి… బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లె నడిచావే
నీ బుట్టలోని పువ్వులన్నీ… గుట్టులన్ని రట్టు చేసి
నన్నీడ నిలిపేనే

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
పల్లి పల్లి ముదినేపల్లి… పల్లి పల్లి ముదినేపల్లి

కాటుక కళ్ళ వాడల్లో… కట్టుకుంటా గుడిసంట
పసుపుతాడు పడకుండా… ఆగడాలే వద్దంటా
చింతపల్లి చిన్నోణ్ణి… చూడు నీకు వరసంట
వరస కాదు నాకంట… మనసు ఉంటే చాలంట
పగలు రేయి నీతో ఉంటా… ఉన్నావంటే అది తప్పంటా
కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి… నేను పువ్వులమ్ముతుంటే, కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు… ముద్దరాలి సొగసుకు గాలాలే వేస్తావే

తననాన నాన నననాన… తననాన నా తననాన నాన
తననాన నాన నననాన… తననాన నాన నాననా

తమలపాకు తడిలోన… పండెనే నీ నోరంట
నోటి పంట కాదంట… పాడిపంట చూడంటా
నాకు నువ్వే తోడుంటే… సంబరాలే నట్టింట
ఆశ పడిన మావయ్యది… అందమైన మనసంటా
అందం చందం, నీకే సొంతం… వెన్నెల్లోనే, ఏసా మంచం
పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి… నేను పువ్వులమ్ముతుంటే, కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు… ముద్దరాలి సొగసుకు గాలాలే వేస్తావే

తననాన నాన నననాన… తననాన నా తననాన నాన
తననాన నాన నననాన… తననాన నాన నాననా
పల్లి పల్లి ముదినేపల్లి… ముదినేపల్లి
పల్లి పల్లి మానేపల్లి… ముదినేపల్లి
అనకాపల్లి పల్లి పల్లి, కొండపల్లి… ముదినేపల్లి
ముదినేపల్లి… పల్లి పల్లి, మానేపల్లి

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading