నింగిలున్న మేఘం కుందోసూపున్నాది
చినుకు చినుకు జారి అవని చేరుకునే
పుడమి తల్లి పులకరించేను మా అమ్మ
మొలక మొలక పెరిగి పూచేను పూలమ్మ
పూచిన పూలవి ఏనాటివో
ఊళ్ళో అన్నదమ్ముల చేత చేరేనే లోగిళ్ళు
కొలిచిన లోగిళ్ళే కోవెల గుడిలాయె
కోరి మొక్కిన ఇంట్లో నిలిచేవు మా అమ్మ
హత్తుకోని ఈయమ్మ హారతులే ఇవ్వగా
ఆడబిడ్డలచేత రూపానివైనావే
ఆడబిడ్డలచేత రూపానివైనావే, ఏ ఏఏ
పుట్టమన్ను తీసుకొచ్చి
జాజురాళ్ళు తీసుకొచ్చి
అలుకుపూతలన్నీ సల్లీ
పసుపుకుంకుమల ముగ్గులేసి
పసుపుకుంకుమల ముగ్గులేసి
గుభాళించే గునుగు పువ్వులు
తల్లి తంగేడు పువ్వుల రెమ్మలు
ముచ్చటైన ముద్దబంతులు
గుబురు గుబురు గుమ్మాడి పువ్వులు
గుబురు గుబురు గుమ్మాడి పువ్వులు
పాలసంద్రపూలు అన్ని పండుగోలే
పరుగుపరుగునా వచ్చే
కళకళలాడే కలువపువ్వులే
దీపాల రూపం కాంతులాయే
ఇంద్రధనుస్సులోని రంగులే పువ్వులై
ఇల్లు ఇల్లు చూడవచ్చే
ఇంద్రధనుస్సులోని రంగులే పువ్వులై
ఇల్లు ఇల్లు చూడవచ్చే
పుట్టమన్ను తీసుకొచ్చి
జాజురాళ్ళు తీసుకొచ్చి
అలుకుపూతలన్నీ సల్లీ
పసుపుకుంకుమల ముగ్గులేసి
తమ్మలపాకుల పీటలు చేసి
పచ్చి పసుపుతోని గౌరమ్మ జేసి
పడతులంతా అమ్మా నిన్నే మొక్కి
పబ్బతి పట్టేరే, ఏ ఏ
ఓ లచ్చగూమ్మాడి… ఓ లచ్చగూమ్మాడీ
పుట్టింటి బిడ్డలు అత్తింటి కోడళ్ళు
తీగలల్లినోల్లే కాళ్ళు కలుపుకుంటు
తేనెలొలికెనట పాట పాడుకుంటూ
మైమరిసి పోయేరే, ఏ ఏ
ఓ లచ్చగూమ్మాడి… ఓ లచ్చగూమ్మాడీ
ఆట జూసి అయ్య మురిసే
పాట జూసీ పల్లె మురిసే
ఊరి చివరా చెరువు మురిసే
లేగ దూడే గంతులేసే
పైరు తల్లి పరవసించే
పాలపిట్ట సూడవచ్చే
నిండుగున్న పంటసేను
నింగి వైపే చూసి మురిసే
ఓ లచ్చగూమ్మాడి… ఓ లచ్చగూమ్మాడీ
గిండి గజ్జెల్లా గువ్వల్లా… గౌరమ్మ ఆడింది
ఓ సందమామల్ల… ఓ సందమామల్లా
నిండు పౌర్ణమి రోజుల్లా… నీలకంఠుడు ఆడిండే
ఓ సందమామల్ల… ఓ సందమామల్లా
గౌరమ్మ ఆడింది… ఎన్నెల ఎన్నెల
నీలకంఠుడాడిండు… ఎన్నెల ఎన్నెల
ఆ ఎండి గిరకల్ల… ఎన్నెల ఎన్నెల
గౌరిశంకరుడు ఆడే… ఎన్నెల ఎన్నెల
రామ ఉయ్యాల రామ ఉయ్యాల
రామగిరి సెందురాల ఏలో ఎన్నీయలో
రామ ఉయ్యాలా… రామ ఉయ్యాలా
పువ్వుల రాసులా పండుగ ఇయ్యాల
రామ ఉయ్యాలా… రామ ఉయ్యాలా
డప్పుల్ల దరువుల్ల సిందూలెయ్యాలా
రామ ఉయ్యాలా… రామ ఉయ్యాలా
రతనాల బతుకమ్మకి పండుగ ఇయ్యాలా
నీటియలల పడువ నిను స్వాగతించెనే
అమ్మా బతుకమ్మ
నింగీ తారల చెరువుల సాగనంపవచ్చెనే
సద్దుల బతుకమ్మ
మా పిల్లా జల్లలమ్మ సల్లంగా సూడవే
సక్కని బతుకమ్మ
మల్లేడుకు మా ఇల్లు సేరగ రావమ్మా
మా తల్లీ బతుకమ్మ
సేరగ రావమ్మా
మా తల్లీ బతుకమ్మ
చేరగ రావమ్మా
మా తల్లీ బతుకమ్మ
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.