Menu Close

ఎన్నో సార్లు విన్న కథ కానీ నటులే వేరు – Emotional Stories in Telugu


ఎన్నో సార్లు విన్న కథ కానీ నటులే వేరు – Emotional Stories in Telugu

పక్క గదిలో నుండి చెల్లెలు బిగ్గరగా బట్టి కొడుతోంది సుమతిశతకం పద్యాన్ని. నేను అమ్మకు తోడుగా వంటింట్లో ఉన్నాను. రాత్రి ఎనిమిది అయింది నాన్న ఇంకా ఇంటికి రాలేదు. “మనం తిని పడుకుందం అమ్మ.., నాన్న ఎప్పుడు వస్తాడో తెలియదు” అన్నాను అమ్మతో!

లేదమ్మ వస్తాడు నీవు, చెల్లి తినండి నేను మీ నాన్న వచ్చిన తర్వాత తింటాను లే” అంది అమ్మ. మాటల్లోనే వచ్చాడు నాన్న విపరీతంగా తాగినట్టున్నాడు…. తులుతూ…. వస్తూ, వస్తూ నే అమ్మ పైన తిట్ల దండకం మొదలెట్టాడు. అమ్మ కూడా నాన్న కు ఎదురు మాట్లాడతానే ఉంది. నాన్నకు కోపం ఎక్కువ అయింది నాకు ఏదో జరగరానిది జరగ బోతావుంది అని భయం వేసి ఒక మూల న నక్కి వణుకుతూ ఏడుస్తూ ఉన్నాను.

ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది నేను ఏడుస్తూ అరుస్తున్నాను ఊరుకోండి నాన్న, ఊరుకోండి అమ్మ అని… కాని నా మాటలు గాలిలో కలిసి పోతున్నాయి తప్ప వారి చెవికి వినిపించడం లేదు. నాన్న పక్కనే ఉన్న రోకలి బండ తీసుకొని అమ్మ నెత్తిమీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకు అమ్మ నేలమీద పడి పోయింది. నేను పరుగున వెళ్లి అమ్మ అంటూ మొత్తుకున్నా తల పగిలి పోయి రక్తం దారలా కారి పోతుంది.

అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి నా వంక చూసి ఏమో చెప్పబోయింది కాని మాట రాలేదు . చెల్లి ఈ గొడవ విని పక్క గది లోనుండి వచ్చింది. నాన్న ఎటో వెళ్ళిపోయాడు …. ఆ చీకటిలో పక్కింటి బాబాయి, ఇరుగు, పొరుగు వారు వచ్చారు “మీ అమ్మ చనిపోయిందమ్మ” అన్నాడు…ఏడుస్తూ బాబాయి. అంతే నేను, చెల్లి అనాథలమయ్యాము.

poor kids telugu bucket

దీనిని కథ అనాలా..? లేక నిజమనాలా..? ప్రతి ఊరిలో ఇలాంటి కథ ఒకటి వుంది. ఈ కథ విన్న ప్రతి సారి అయ్యో పాపం అనుకోవడం తప్ప ఏమీ చెయ్యలేము.

ఎన్నో సార్లు విన్న కథ కానీ నటులే వేరు – Emotional Stories in Telugu

ఓ తరం ఆడవారి జీవితాలు – Women in India
మీ కోడలి సంపాదన ఎంత – Women Financial Status

Share with your friends & family
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading