కోయిలా కోయిలా కూయవే నీవిలా
కోయిలా కోయిలా కూయవే నీవిలా
భాషలలో మిన్నగా తెలుగుకున్న హాయిలా
కోయిలా కోయిలా ఊగాలిలే ఊయలా
ఏ భాషకు అందని సొగసు కన్నె హొయలులా ||కోయిలా కోయిలా||
ఆమని వీణియపై రాగాల గలగలలా
చిగురు వగరు తగలగానే
కూ అనవే నీవలా… ప్రాణాలు లాగేలా
ఈ వణి రాణివై ఏలాల సరిగమలా
పూలకారు చూడగానే… అలా రేగిపోవాలా రాగాల కోయిలా
నీ కుహుకుహూలను ఎద పంచు… మా తహతహలను మరిపించు
మావి గుబురులోనించి… నీ తేనె కబురులు వినిపించు ||కోయిలా కోయిలా||
బావ రావా..! అన్న మరదలి పిలుపే తలపిస్తావు
ఎన్నో ఎన్నెన్నో మరెన్నో… చిలిపి తలపులే ఇస్తావు
పాట మదిర తాగి ఊగేవారే కవులే అయ్యారే
కవిత మీద కవితలు పొంగి చెరితే రాసే ‘సినారె’
తెల్లని మల్లెలు విరియాల… ఉల్లము ఝల్లని మురియాల
గీతి నగరులోనుంచి… మా జాతి కథలను వినుతించు ||కోయిలా కోయిలా||
కోయిలా కోయిలా కూయవే నీవిలా
కోయిలా కోయిలా కూయవే నీవిలా
భాషలలో మిన్నగా తెలుగుకున్న హాయిలా
కోయిలా కోయిలా ఊగాలిలే ఊయలా
ఏ భాషకు అందని సొగసు కన్నె హొయలులా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.