ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షించే అత్యద్భుతమైన సంజీవిని మహోన్నతమైన ఔషధం మునగ ఆకు అనే సంగతి నిజంగానే నిజం.
అసలు ఎన్నో వేల వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్స్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఎంతో అర్థం చేసుకోండి.
ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ ములగ చెట్టు ఇది వరకు వుండేది. ఇప్పుడు వాటిని మనం కొట్టెయ్యడం మొదలు పెట్టాం. ఆ చెట్టు మొదట్లో పూలూ చెట్లూ కాయలకు పెరగుతాయని. అవి దురదలు పెడతాయనీ.. కానీ నిజానికి ఆ గొంగళీ పురుగులు ఆ తరువాత కాలంలో మొత్తం ప్రపంచానికే ఎంతో ఉపయోగపడే అందమైన సీతాకోక చిలుకల్లా మారతాయి.
మనకు ఆమాత్రం ఓపిక లేకుండా పోతోంది. మా చిన్నప్పుడు ములగ చెట్టు మొదలు చుట్టూ ఒక ముళ్ళ కంచె వేసేవారు కానీ వాటిని మా అమ్మమ్మ వాళ్ళు చంపనిచ్చే వారు కాదు. ఇప్పుడు మనం తెలివి ఎక్కువై మొత్తం చెట్టే కొట్టేసి అద్భుతమైన సంజీవనినే చేతులారా చంపేస్తున్నాం.
మునగాకులో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషద గుణాలు:🌿🌿🌿🌿🌿🌿
👉మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
👉క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ Aని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు.
👉కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు.
👉పాల నుంచి లభించే క్యాల్షియం కన్నా 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.
పైగా పాలు 7 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచీ పెద్దలవరకూ జీర్ణం కాకపోగా ఎసిడిటీని పెంచుతాయి.
అందుకనే కేన్సర్ వ్యాధి గ్రస్తులకు మరింత ఎసిడిటీ పెరగకుండా పాలనూ పాలతో చేసిన స్వీట్లనూ స్వీకరించవద్దని వైద్యులంతా చెప్తారు.
👉మజ్జిగా పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.
👉అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.
👉మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.
👉అన్ని రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషదం మునగాకు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. మునగ ఆకు అరటి ఊచ (అరటి చెట్టు మధ్యలో కొంచెం తెల్లగా వుండే కాండము) వీటితో కూర చేసుకుని తినమని ఆయుర్వేద వైద్యంలో పెద్దలంతా చెప్తారు.
👉ట్యూమర్ లు రాకుండా కూడా ఈ మునగ ఆకు వ్యవహరిస్తుంది.
👉థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.
👉మునగాకులో ఉండే రక్తంలో ఏంటీ ఆక్సిడెంట్స్ ని పుష్కలంగా పెంచి పాంక్రియాస్ ని పరిశుభ్రం చేసి షుగర్ లెవల్స్ ని సరిగ్గా వుండేలాగా చేస్తుంది.
👉మునగాకులో ఎ, సి., విటమిన్లు పుష్కలంగా వున్నాయి.
👉మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు లో వున్న స్థాయిలో ఈ విటమిన్లు వుండవు.
👉అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.
✍️వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం:🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
👉నీరు – 75.9 శాతం.
👉పిండి పదార్థాలు – 13.4 గ్రాములు.
👉ఫ్యాట్స్ – 17 గ్రాములు.
👉మాంసకృత్తులు – 6.7 గ్రాములు
👉కాల్షియం – 440 మిల్లీ గ్రాములు.
👉పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు
👉ఐరన్ – 7 మిల్లీ గ్రాములు.
👉‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు.
👉ఖనిజ లవణాలు – 2.3 శాతం.
👉పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు.
👉ఎనర్జీ – 97 కేలరీలు.
✍️ఔషధ విలువలు అద్భుతం:🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
👉ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి.
👉మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి.
👉మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి.
👉మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.
👉గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం.
👉మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.
👉మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.
✍️మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు:
👉మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.
👉గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
👉తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు.
👉పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.
👉గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.
👉మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి.
👉మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.
👉ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.
👉 వాత వాయువులను, కడుపునొప్పి, అల్సర్లు, పేగు పూతలు పోగొడుతుంది. ఆముదం మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్లనొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి.
👉 ఆముదం, మునగాకు కలిపి ఉడికించి గుడ్డలో మూటకట్టి గవదబిళ్లపై కడితే తగ్గిపోతాయి.
👉 మునగాకు రసం తీసి గ్లాసులో తేరబెట్టి దానికి తేనె కలిపి తాగితే గొంతులో పుండ్లు కంఠరోగాలు, కాలేయంలోని అల్సర్లు తగ్గుతాయి. కాకపోతే మునగాకు గ్రామాల్లో లభ్యమయినంతగా పట్టణాలలో లభ్యం కాకపోవచ్చు.
👉 కొంతమంది పిల్లలు రాత్రిళ్లు పక్క తడుపుతూంటారు. అలాంటివారికి ఈ మునగాకును పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుత గుణాన్నిస్తుంది.
గౌతమ్ కశ్యప్
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com