ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
వెంకటేష్ నటించిన “నారప్ప” సినిమా జులై 20 2021 వ తేదీన రిలీస్ కాబోతుంది, ఈ సినిమా తమిళ నటుడు అయిన దనుష్ నటించిన “అసురన్” అనే సినిమా రీమేక్ అవ్వడం వల్ల ఈ సినిమా అంచనాలు ఇంకా ఎక్కువుగా వున్నాయి, అసురన్ సినిమా తమిళం లో మంచి విజయాన్ని సాదించింది. అది కాకుండా జాతీయ స్తాయి లో మంచి ప్రశంసలు అందుకుంది.
అందులోనూ ఇటీవల కాలంలో రిలీస్ అయిన ట్రైలర్ లో వెంకటేష్ గారి నటన, మాట తీరు వేష దారణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది, అందుకని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్ధామ అని ఎదురు చూస్తున్నారు.
ఫస్ట్‌లుక్ నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. అద్భుతమైన కథతో పాటు భావోద్వేగాలు కలగలిపిన చిత్రం ఇది. ఇలాంటి సినిమా నా కెరీర్‌లో ఎప్పుడూ చేయలేదు. కథ వినగానే సినిమా చేయాలని అనుకున్నాను.
కమర్షియల్ సినిమాలు చాలా వస్తాయి. కానీ.. ఇంత యదార్థంగా, రఫ్‌గా చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. డ్రామా, హైవోల్టేజ్, ఎలివేషన్ ఇలా చాలా విషయాలు ఉన్నాయిందులో. సరైన సమయంలో సరైన సినిమా చేశానని భావిస్తున్నాను. ఇలాంటి పాత్ర దొరకడం నిజంగా అదృష్టం అనుకుంటున్నా.
ఎన్నో సినిమాల్లో నేను నటించాను. కానీ.. ఈ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది. షూటింగ్ సమయంలో ఏదైనా షాట్ వేరేలా చేద్దామన్నా చేయలేకపోయాను. ఎందుకంటే ఇది రియలిస్టిక్‌గా ఉండాలి. అందుకే బయట కూడా నారప్ప పాత్రలో ఉండిపోయాను. అవే కాస్టూమ్స్‌లో పడుకునేవాడిని.. అలాగే భోజనం చేసేవాడిని’’ అని వెంకటేశ్ అన్నారు.
Narappa Telugu Movie (2021)
- Directed by: Srikanth Addala
- Stars: Venkatesh, Priyamani
- Category: Film
- Genre: Drama, Action
- Language: Telugu
- Streaming Date: 20 Jul 2021
ఈ సినిమాని జులై 20, 2021 Amazon Prime లో రీలీజ్ చేస్తున్నారు, amazon prime లో అక్కౌంట్ వున్న వాళ్ళు ఈ సినిమాని వీక్షించవచ్చు. లింక్ ఈ క్రింద ఇచ్చాము.