ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఈశ్వరా పరమేశ్వరా… చూడరా ఇటు చూడరా
రెండు కన్నుల మనిషి బ్రతుకును
గుండె కన్నుతో చూడరా
ఎదుట పడనీ వేదనలను… నుదుటి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా… చూడరా
ఆఆఆ ఆ… ఇటు చూడరా
దారి ఏదో, తీరమేదో… గమనమేదో, గమ్యమేదో
లేత ప్రేమల లోతు ఎంతో… లేని కన్నుతో చూడరా
చీకటేదో, వెలుతురేదో… మంచు ఏదో, మంట ఏదో
లోకమెరుగని ప్రేమకథని… లోని కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా…
చూడరా… ఆఆఆ ఆ… ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా…
చూడరా… ఆఆఆ ఆ… ఇటు చూడరా
నువ్వు రాసిన రాతలిచ్చట… మార్చుతూ ఏమార్చుతుంటే
నేల పైన వింతలన్నీ… నింగి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా… చూడరా
ఆఆ… ఇటు చూడరా
మసక బారిన కంటిపాపకి… ముసుగు తీసే వెలుగు లాగ
కాలమడిగిన కఠిన ప్రశ్నకి… బదులువై ఎదురవ్వరా
ఈశ్వరా పరమేశ్వరా… చూడరా
ఆఆఆ ఆ… ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా… చూడరా
ఆఆఆ ఆ… ఇటు చూడరా