Menu Close

Kallallo Kalavaramai Song Lyrics in Telugu – Dorasaani

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

కళ్ళల్లో కలవరమై, కలవరమై… గుండెల్లో పరవశమో వరమై
కళ్ళల్లో కలవరమై… కలవరమో వరమే అవ్వగా…
కళ్ళల్లో కలవరమై, కలవరమై… గుండెల్లో పరవశమో వరమై
కళ్ళల్లో కలవరమై, కలవరమై… కలిగే కోరికా…

ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా… ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా
ఆరాటాల ఒడిలో వాలుతూ… ప్రాణమే ఆనందాల నిధికై చూడగా
ఊరించే ఊసులు ఎన్నో… ఉడికిస్తూ చంపుతుంటే…
ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే…

పాలబుగ్గలోని తళుకులే… వెన్నుపూసలోన వణుకులై
కంటిపాపలోన కవితలా మారే… ఏ ఏ
చిన్ని మనుసులోని పువ్విలా… పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవి పైన ముత్యమై మెరిసే…

ఏవో ఏవో ఏవో ఆశలే మెల్లగా… ఎదపై తీపి మధువే చల్లగా
ఏదో ఏదో ఏదో మైకమే ముద్దుగా… మైమరపించు మాయే చెయ్యగా
అణువణువు అలజడి రేగి… తమకంలో తేల్చుతుంటే
ఆ ఆదమరపులోన ఈడు సతమతమై…

పాలబుగ్గలోని తళుకులే… వెన్నుపూసలోన వణుకులై
కంటిపాపలోన కవితలా మారే… ఏ ఏ
చిన్ని మనుసులోని పువ్విలా… పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవి పైన ముత్యమై మెరిసే…

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading