Menu Close

Gaali Vaaluga Song Lyrics In Telugu – Agnyaathavaasi


గాలి వాలుగా… ఓ గులాబీ వాలి
గాయం అయినదీ… నా గుండెకి తగిలి
తపించిపోనా… ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా… చెలీ ఇలా దొరికితే నీ స్నేహం

ఏం చేసావే… మబ్బులను పువ్వుల్లో తడిపి
తేన జడిలో ముంచేసావే
గాలులకు గంధం రాసి పైకి విసురుతావే
ఏం చేస్తావే… మెరుపు చురకత్తులనే దూసి
పడుచు ఎదలో దించేసావే
తలపునే తునకలు చేసి… తపన పెంచుతావే

నడిచే హరివిల్లా… నను నువ్విల్లా గురిపెడుతుంటే ఎలా
అణువణువునా విల విలమనదా…  ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలు నిలబడు పిల్లా… గాలిపటంలా ఎగరకే అల్లా
సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా

చూస్తేనే గాలి వాలుగా… ఓ గులాబీ వాలి
గాయం అయినదీ… నా గుండెకి తగిలి
తపించిపోనా… ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా… చెలీ ఇలా దొరికితే నీ స్నేహం

కొరకొర కోపమేల… చురచుర చూపులేల
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
అరె..! అని జాలి పడవే పాపం కదే ప్రేయసి
సరే అని చల్లపడవే మోసి పిశాచి
ఉహు అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి
అహో అలా నవ్వుతావే మీసం మెలేసి
ఎన్నాలింకా ఊరికే ఊహల్లో ఉంటావ్ పెంకీ పిల్లా
చాల్లే ఇంక మానుకో… ముందు వెనుక చూసుకొని పంతం
ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం
చాలు యుద్ధం రాజీకి వద్దాం
కొద్దిగా కలిసొస్తే నీకేమిటంటా కష్టం

నడిచే హరివిల్లా… నను నువ్విల్లా గురిపెడుతుంటే ఎలా
అణువణువునా విల విలమనగా…  ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలబడు పిల్లా… గాలిపటంలా ఎగరకే అల్లా
సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా

ఏం చేయాలో లే…!!
గాలి వాలుగా… ఓ గులాబీ వాలి
గాయం అయినదీ… నా గుండెకి తగిలి
తపించిపోనా… ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా… చెలీ ఇలా దొరికితే నీ స్నేహం

Like and Share
+1
1
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading