అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
తాడిని తన్నే వాడుంటే… వాడి తలను తన్నేవాడు కూడా ఉంటాడు-Telugu Stories
నాగయ్య రంగయ్యకు ఒక నుయ్యి అమ్మాడు, తాను చాలా తెలివిగా నూతిని మాత్రమే అమ్మాననుకుని సంబరపడి రెండు రోజులు పోయిన తరువాత రంగయ్య దగ్గరకు వెళ్ళి “నేను నీకు నూతిని మాత్రమే అమ్మాను.
నూతిలో నీళ్ళు అమ్మలేదు. నీరు వాడుకుంటే నాకు డబ్బులు కట్టాలి” అన్నాడు. దానికి రంగయ్య బదులిస్తూ “నేనూ మీకు అదే చెబుదామనుకుంటున్నాను. మీరు నూతిని నాకు అమ్మేసారు కాని, దానిలో నీళ్ళింకా ఖాలీ చెయ్యలేదు.
సాధ్యమైనంత త్వరగా ఆ నీళ్ళు ఖాలీ చేసి నుయ్యి అప్పచెప్పండి, లేదా మీనీళ్ళు మా నూతిలో ఉంచుకుంటున్నందుకు అద్దె కట్టండి.” అన్నాడు. దాంతో అంతవరకు తానే తెలివైనవాడిననుకున్న నాగయ్య కు మూర్ఛ వచ్చినంత పనయింది.