Menu Close

జీవిత సత్యాన్ని తెలిపే బొద్దింక థియరి – Cockroach Theory by Sunder Pichai in Telugu


జీవిత సత్యాన్ని తెలిపే బొద్దింక థియరి – Cockroach Theory by Sunder Pichai in Telugu

ఒకసారి గూగుల్ CEO అయిన సుందర్ పిచై సమస్యల పట్ల మనం ఎలా స్పందించాలో అన్న విషియాన్ని అద్బుతంగా చెప్పడం జరిగింది.

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ఓరెస్టారెంట్ లో నలుగురు భోజనం చేస్తున్నారు. ఇంతలో అందులోని ఓ మహిళ మీద బొద్దింక పడింది, ఆ బొద్దింకను చూసి ఆ మహిళ చెంగున్న అంతెత్తు లేచి,గయ్య్….

Cockroach Theory by Sunder Pichai in Telugu

మంటూ అరిచి బొద్దింకను దులిపేసుకుంది. ఇప్పుడు ఆ బొద్దింక ఆ మహిళ పక్కనే ఉన్న మరో వ్యక్తి మీద పడింది…ఆ వ్యక్తి కూడా అలాగే అరిచి బొద్దింకను వదిలించుకున్నాడు. 

ఇంతలో… ఓ వెయిటర్ వీళ్ళకు సర్వ్ చేయడానికి వచ్చాడు… ఈ సారి బొద్దింక అతని మీద పడింది…. దాన్ని చూసిన ఆ వెయిటర్ తన చేతిలోని ఆహార పదార్థాలు టేబుల్ మీద పెట్టి… తన షర్ట్ మీద తిరుగుతున్న ఆ బొద్దింకను ఒద్దికగా చేత పట్టుకొని బయట వదిలేసి వచ్చాడు.

ఇప్పుడు దీన్ని జీవితానికి అన్వయించుకుందాం..

బొద్దింకను ఓ ఇబ్బందిగా, సమస్యగా తీసుకుంటే…. మొదటి మహిళ మరియు వ్యక్తి ఈ సమస్యకు చాలా భయపడిపోయారు. దానిని ఎలాగైనా తప్పించుకోవాలనుకొని సడెన్ నిర్ణయం తీసుకున్నారు.  అదే వెయిటర్…. తనకు బొద్దింక అనే సమస్య ఎదురవ్వగానే…. ఖంగారు పడకుండా… చాలా ప్రశాంతంగా దానిని గమనించి తీసి బయటపడేసి వచ్చాడు (సమస్య నుండి బయటపడ్డాడు).

మనల్ని ఇబ్బంది పెట్టించే అంశాల పట్ల రియాక్ట్ అవ్వకూడదు , రెస్పాండ్ అవ్వాలి. రియాక్ట్ అనేది అచేతనంగా చేసేది, రెస్పాండ్ అనేది ఆలోచించి చేసేది. కాబట్టి ఓ సమస్యను ఎదుర్కొనే ముందు ఆలోచన ముఖ్యం..

స్పూర్తిదాయకమైన సూక్తులు – 5 Latest Telugu Inspiring Quotes

Like and Share
+1
2
+1
1
+1
0
Posted in Information Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading