ఇతరుల అభిప్రాయాలు పట్టించుకోకు – The Courage to Be Disliked – Book Recommendations
పుస్తకం పేరు: The Courage to Be Disliked
రచయితలు: ఇచిరో కిషిమి (Ichiro Kishimi), ఫుమిటకే కోగా (Fumitake Koga)
ప్రచురణ సంవత్సరం: 2013 (జపనీస్), 2018 (ఇంగ్లీష్ అనువాదం)
ఫిలాసఫీ, సైకాలజీ, సెల్ఫ్ హెల్ప్ వంటి విషియాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. జపాన్, కొరియా, ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి.
ఈ పుస్తకం, ఆడ్లర్ సైకాలజీ అనే ఆంతర్ముఖ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని రాయబడింది. ఇందులో ఒక యువకుడు మరియు తత్వవేత్త మధ్య సంభాషణల రూపంలో బహుశా మన జీవితంలో ఎదురయ్యే చాలానే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి.

ఈ పుస్తకం మనకు చెప్పే విషియం ఏంటంటే – “నీవు ఇతరుల అభిప్రాయాలకి బానిస కాకుండా స్వేచ్ఛగా జీవించాలి అని.”
Important points from the the book “The Courage to Be Disliked”
1. ప్రతీ వ్యక్తి తన జీవితం మీద తానే బాధ్యత తీసుకోవాలి.
2. మనం మన గతం వల్ల కాదు, మనం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నిర్మించబడతాం.
3. ఇతరులు మీ గురించి ఏం అనుకుంటారో అని భయపడితే, మీరు ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేరు.
4. సంతోషంగా జీవించాలంటే, ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించకూడదు.
5. అసహ్యించ బడటానికి ధైర్యం అంటే మీ నిజమైన జీవన విధానాన్ని విశ్వసిస్తూ ముందుకు పోవడం.
6. సంబంధాలు అనేవి ‘పవర్’ మీద కాకుండా ‘సహకారం’ మీద ఆదారపడి ఉండాలి.
7. మన బాధలు ఎక్కువగా మన బంధాలపైనే ఆధారపడి ఉంటాయి.
8. జీవితం అంటే పోటీ కాదు, మనం అందరి కన్నా గొప్పవాళ్ళం అని నిరూపించుకునే అవసరం లేదు.
9. ఇతరుల అభిప్రాయాలు వారి ప్రాబ్లమ్ – వాటిని మోయడం మన బాధ్యత కాదు.
10. మన లక్ష్యం ఇతరులకు నచ్చటం కాకుండా, మనకు నచ్చే జీవితం గడపడం కావాలి.
11. సంతోషంగా ఉండటం అనేది ఒక నిర్ణయం – మన సంతోషం పరిస్థితులపై ఆధారపడి ఉండదు. ఎలాంటి పరిస్తితులలోనైనా ఆనందంగా వుండడం అలవాటు చేసుకోవాలి.
12. ఆత్మవిశ్వాసం అనేది మీకు ఇతరులు ఇచ్చేది కాదు – అది మీలో మీరు పెంపొందించుకోవాలి.
13. అలసిపోవడం వల్ల కాదు, ఆ అలుపుకి కారణం అయిన అర్ధంలేని జీవితం మనకి నిజంగా విసుగునిచ్చేది.
14. తప్పులు చేయడం తప్పు కాదు ఆ తప్పుల మీద మన ఆలోచన, స్పందన ముఖ్యం.
15. ఇతరులను గౌరవించు కానీ వాళ్ళని మెప్పించడానికే జీవించకు.
The Courage to Be Disliked పుస్తకం మన జీవితంలో ఉండే నిజమైన “జైలును” గుర్తించి, మన ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛను తిరిగి పొందేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఇది కేవలం ఒక సైకాలజీ పుస్తకం కాదు – ఇది మన దైనందిన ఆలోచనలను ప్రశ్నించే ఒక మానసిక విప్లవం.
తప్పకుండా ప్రతి ఒక్కరూ
చదవాల్సిన పుస్తకం ఇది👇
https://amzn.to/4jK2m2h
పట్టుదల ఉన్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరు – Grit – Book Recommendations