ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నిను చూడకుండ మనసు ఉండదే
మది పదే పదే… నీ వైపే లాగుతున్నదే
నీ చూపులోన… పిలుపు ఉన్నదే
అది సదా సదా… నీ నీడై సాగమన్నదే
కునుకు రాదు, కుదురు లేదు ఒక క్షణమైనా
అదుపు లేదు, అలుపు రాదు… కలయికలోనా
నిను చూడకుండ మనసు ఉండదే
మది పదే పదే… నీ వైపే లాగుతున్నదే
వేల ముత్యాలు, కోటి రత్నాలు… నీ కాలి ముందుంచనా
పూల మేఘాలు, పుణ్య భోగాలు… నీ చేతికందించనా
అంతరిక్షాల వింతలేవైనా… నీ ముందు బంధించనా
కొంతసేపైనా చెంత లేకుంటే… నా గుండె స్పందించునా
కిలకిల నిన్నే నవ్వించనా… కలతలు అన్ని కరిగించనా
మరిమరి నిన్నే ప్రేమించగా… మరుమరు జన్మే జన్మించనా
నిను చూడకుండ మనసు ఉండదే
మది పదే పదే… నీ వైపే లాగుతున్నదే
వెంట నువ్వుంటే ప్రేమ దేశాన… మారాజు నేనవ్వనా
జంట నువుంటే రాణి అందాల… రాజ్యాలు పాలించనా
కౌగిలింతల్లో కంచె వేసేసి… కాలాన్ని ఆపేయ్యనా
కంట నీరంటు జారనీకుండ… ప్రాణాన్ని అడ్డేయ్యనా
కలకల నువ్వే కరుణించితే… గలగల నేనే గిలిపెంచన
కొరకొర మంటు కలహించితే… విలవిలమంటు విలపించనా
నిను చూడకుండ మనసు ఉండదే
మది పదే పదే… నీ వైపే లాగుతున్నదే